‘ఫిదా’ సినిమాతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది సాయిపల్లవి. ‘ఎంసీఏ’లో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా.. ఆ సినిమా కూడా సాయిపల్లవి హిట్లలో ఒకటిగా నిలిచింది. మలయాళంలో ఇప్పటికే ఆమెకు రెండు మెమొరబుల్ హిట్లు వచ్చాయి. ఇప్పుడిక తమిళంలోనూ పాగా వేయడానికి సిద్ధమవుతోంది సాయిపల్లవి. ఆమె తమిళంలో నటించిన ‘కారు’ సినిమా నెల కిందటే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కణం’ పేరుతో ఒకేసారి విడుదల చేయాలని చూస్తున్నారు. ఐతే సరైన రిలీజ్ డేటే దొరకట్లేదు.
‘కణం’ను రిలీజ్ చేస్తే ఈ నెలలోనే రిలీజ్ చేయాలి. లేదంటే ఇంకో రెండు మూడు నెలలు డేట్లు దొరికే అవకాశం లేదు. మార్చి 16కు ఆల్రెడీ ‘కిరాక్ పార్టీ’.. ‘కర్తవ్యం’ షెడ్యూల్ అయి ఉన్నాయి. 23న కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ వచ్చే అవకాశాలున్నాయి. ‘కణం’ను దానికి పోటీగా దించుదామని చూస్తున్నారట. కానీ అదే తేదీకి తమిళంలోనూ రిలీజ్ డేట్ కుదురుతుందా.. రెండు చోట్లా థియేటర్లు సరిపడా దొరుకుతాయా అన్నది చూడాలి. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ కావడం.. పైగా సీరియస్ సినిమాలా ఉండటంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో అంతగా ఆసక్తి కనిపించడం లేదు. రెండు చోట్లా దీనికి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. ‘ఛలో’ విజయంతో మంచి ఊపుమీదున్న నాగశౌర్య ప్రమోషన్లకు వస్తే తెలుగులో కొంచెం క్రేజ్ వచ్చేదేమో. అతను అటువైపే చూడలేదు. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రానికి బిజినెస్ పూర్తయి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.