మలయాళ 'ప్రేమమ్' చిత్రంతో సౌత్ మొత్తం సందడి చేసిన సాయి పల్లవి తెలుగులోకి 'ఫిదా' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కడంతో తెలుగులో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకం పెట్టుకున్నారు. దిల్ రాజు వంటి స్టార్ నిర్మాత వరుసగా ఆమెను మూడు సినిమాల్లోకి బుక్ చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో నటించాలని హీరోయిన్స్ కోరుకుంటూ ఉంటారు. కాని సాయి పల్లవి మాత్రం దిల్ రాజు బ్యానర్ లో ఫిదా తర్వాత 'ఎంసీఏ' చిత్రానికి మాత్రమే ఓకే చెప్పింది. కథ బాగాలేదంటూ శ్రీనివాస కళ్యాణం చిత్రంకు నో చెప్పింది.
మంచి హీరో, మంచి కథ అయితేనే సినిమాకు ఓకే చెప్తానంటూ పట్టుబట్టుకు కూర్చున్న సాయి పల్లవికి తాజాగా 'పడి పడి లేచే మనసు' చిత్రం ఫ్లాప్ ను మిగిల్చింది. హను రాఘవపూడి చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన సాయి పల్లవి ఆ చిత్రాన్ని చేసి నిరాశకు గురైంది. కణం మరియు పడి పడి లేచే మనసు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడంతో సాయి పల్లవి క్రేజ్ తగ్గిపోయింది. మంచి కథలు వస్తేనే చేస్తాను, స్కిన్ షో చేయను అంటూ గిరి గీసుకు కూర్చున్న సాయి పల్లవికి ఇప్పుడు అసలు ఆఫర్లే లేకుండా పోయాయి.
తమిళంలో ఒక సినిమా చేస్తున్న సాయి పల్లవి తెలుగులో ఒకటి రెండు ఆఫర్లను లైన్ లో పెట్టింది. వాటికి ఓకే చెప్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. పెద్ద సినిమాల్లో, స్టార్ హీరోలకు జోడీగా మాత్రం ఈమెకు ఆఫర్లు రావడం లేదు. ఈమె పెట్టే కండీషన్స్ తో పాటు, చిత్ర యూనిట్ సభ్యులకు ఈమె సరైన మర్యాద ఇవ్వదని, షూటింగ్ లో సమయ పాలన పాటించదంటూ గతంలో విమర్శలు వచ్చాయి. దాంతో సాయి పల్లవిని సైడ్ చేసేస్తున్నారు. మంచి కథలతో ఫిదా వంటి సినిమాలు చేయాలని భావించిన సాయి పల్లవి సీన్ రివర్స్ అయ్యింది.
హీరోయిన్స్ అన్నప్పుడు వచ్చిన ప్రతి అవకాశంను చేయాలి, లక్ కలిసి వస్తే ఫిదా వంటి కథలు అప్పుడప్పుడు దగ్గరకు వస్తాయి. అలాంటి కథలు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉండాలి అంటే వచ్చిన ప్రతి సినిమాకు ఓకే చెప్పాల్సిందే. తమిళంలో ధనుష్ తో మారి 2 చేసినా కూడా అది సాయి పల్లవికి పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. దాంతో తమిళంలో కూడా సాయి పల్లవి సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటికైనా సాయి పల్లవి కాస్త తగ్గి సినిమాలకు ఓకే చెప్తుందేమో చూడాలి.