ఫిదా సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ఆమె మీడియా క్రియేట్ చేసిన స్టార్ హీరోయిన్ కాదు... జనాల్లో ముఖ్యంగా మాస్ ఆడియన్స్ తయారు చేసిన స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా ఆమె ఒక స్థాయికి వెళ్లడంలో ఆమె ప్రతిభ మరియు సింప్లిసిటీ కారణం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
అతి తక్కువ సమయంలోనే తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీల్లో ఆకాశమే హద్దు అన్నట్లుగా గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి తో సినిమాలకు చిన్న హీరోల నుండి మొదలుకుని స్టార్ హీరోల వరకు ఆసక్తిగా ఉన్నారు. రికార్డు స్థాయి లో పారితోషికం ఇస్తానంటూ వెంట పడుతున్నా కూడా సాయి పల్లవి మాత్రం గత కొన్ని నెలలుగా సినిమాలకు అస్సలు ఓకే చెప్పడం లేదు.
సాయి పల్లవి సినిమా లు చేయక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఫిల్మ్ మేకర్స్ ఆమెను కలిసేందుకు ప్రయత్నించినా కూడా కనీసం ఆమె కలవడం లేదట. సినిమాల గురించి ప్రస్తుతానికి చర్చించడానికి ఆసక్తి లేదంటూ తేల్చి చెబుతుందట. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు ఇటీవల విడుదల అయ్యాయి. ఆమె నటించిన విరాట పర్వం తప్ప మరే సినిమా కూడా లైన్ లో విడుదలకు లేదు.
రానా తో కలిసి నటించిన విరాట పర్వం సినిమా సాయి పల్లవి 'చివరి' సినిమా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మరియు వార్తలు అభిమానులను భయపెడుతున్నారు. విరాటపర్వం సినిమా సాయి పల్లవి లాస్ట్ సినిమా అయ్యి ఉంటుందేమో అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ఆమె విరాట పర్వం సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇటీవలే సాయి పల్లవి సోదరి కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆమె కుటుంబం నుండి మద్దతు లేకపోవడం వల్లే సినిమాలు చేయడం లేదేమో అనే వార్తలు నిజం కాదు. కాని సాయి పల్లవి ఏదో బలమైన కారణం వల్లే కొత్త సినిమాలకు కమిట్ అవ్వడం లేదు.
ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలు ఉంటాయి.. వాటన్నింటిని ఎదుర్కొంటూ సినిమాల్లో నటిస్తూ తమ సినిమాలతో సమాధానం ఇవ్వాలి కాని ఇలా సినిమాలకు దూరం అవ్వడం ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా సాయి పల్లవి సినిమాలు చేయక పోవడంపై కామెంట్స్ చేస్తున్నారు. విరాటపర్వం సినిమా తర్వాత సాయి పల్లవి సినిమాలకు కమిట్ అవుతుందని ఆశిద్దాం.