ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా దక్షిణాది ప్రేక్షకుల్ని మాయచేసి పారేసింది సాయిపల్లవి. ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయిపోయారు. తెలుగులో ప్రేమమ్ రీమేక్ లో కూడా ఆమే నటిస్తుందని అందరు ఊహించారు కానీ ఆ అవకాశం శృతిహాసన్ కు దక్కింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల ఫిదా తీయడం - సాయి పల్లవి హిట్ కొట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఫిదా సినిమాలో సాయిపల్లవిని చూసిన వాళ్లందరి అభిప్రాయం ఒక్కటే. ఈ అమ్మాయి సూపర్ హీరోయిన్ అవుతుందని. ఆమెకు అవకాశాలు కూడా అలాగే వచ్చాయి. కానీ అదృష్టం మాత్రం రివర్స్ గేర్ లో ఉంది. ఈ ఏడాది సాయి పల్లవి మూడు సినిమాలు చేసింది. మొదటిది కణం. సినిమా వచ్చినట్లు కూడా ఎవ్వరికీ తెలీదు. రెండోది పడిపడి లేచె మనసు. ఈ సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ అందరూ బాగుందని అంటున్నారు కానీ సినిమా పరిస్థితి గురించి మాత్రం మాట్లాడ్డం లేదు. ఇక ముచ్చటగా మూడోది మారి 2. అసలు ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా లేవంటే అతిశయోక్తి కాదు. నిన్నటివరకు సాయిపల్లవి గోల్డెన్ లెగ్. కానీ ఇప్పుడు సడన్ గా పరిస్థితి మారిపోయింది. ఆమెను ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ గా భావిస్తున్నారు. ప్రస్తుతానికి సాయిపల్లవికి తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. తమిళ్ లో మాత్రం సూర్యతో ఒక సినిమా చేస్తోంది. అది హిట్టైతేనే సినిమాలు. లేదంటే.. ఎంత ఫాస్ట్‌గా వచ్చిందో అంతే ఫాస్ట్ గా వెనక్కి వెళ్లిపోయిన హీరోయిన్‌గా మిగిలిపోతుంది సాయిపల్లవి.