ఫిదాలో భాగమతిగా వచ్చిన అశేషమైన పేరు ప్రఖ్యాతులు సాయి పల్లవికి ఎక్కువ కాలం నిలవలేకపోతున్నాయి. కథలో ఎంపికలో చేస్తున్న దారుణమైన తప్పిదాలు ఏకంగా కెరీర్ కే ఎసరు పెడుతున్నాయి. ముఖ్యంగా మొన్న వచ్చిన ఎన్జికెలో ఓ మాములు అనుమానం భార్య పాత్రను చూసి అభిమానులు జీర్ణం చేసుకోలేకపోయారు. పెర్ఫార్మన్స్ కూడా అంతంత మాత్రంగా ఉండటంతో విమర్శకుల తిట్లు తప్పలేదు.
ఇప్పటిదాకా చేసిన వాటిలో ఇదే అత్యంత పేలవమైన పాత్ర అంటూ కామెంట్స్ కూడా జోరుగా వినిపించాయి. ఇప్పుడు అవి సాయి పల్లవి దాకా చేరాయి. ఇది స్క్రిప్ట్ పూర్తిగా పరిశీలించకుండా ఒప్పుకున్న పాత్రని ఇంకోసారి జాగ్రత్త పడతానని తన సన్నిహితుల వద్ద అన్నట్టు టాక్. ఏది ఎలా ఉన్నా ఇప్పటికైతే బాగా డ్యామేజ్ జరిగింది. గ్లామర్ పరంగా కూడా సాయి పల్లవిలో కొంత గ్లో తగ్గినట్టు కనిపిస్తోంది.
ఇందులో కూడా ఎలాంటి ప్రత్యేకత లేని ఓ మాములు నటి అనే ఫీలింగ్ కలిగించింది. అందుకే కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టు కోలీవుడ్ టాక్. ఊరికే కాంబినేషన్ల వ్యామోహంలో పడకుండా తాను ముందు నుంచి కట్టుబడిన నటనకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలు అయితే ఒప్పుకోవాలని నిర్ణయించుకుందట. రానాతో వేణు ఊడుగుల తీయబోయే పొలిటికల్ థ్రిల్లర్ అయినా అలాంటి బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఇది తప్ప తను కొత్తగా ఒప్పుకున్న కమిట్మెంట్స్ ఏమి లేవు