‘ఫిదా’తో ఒక్కసారిగా తెలుగులో స్టార్ ఇమేజ్ సంపాదించేసింది సాయిపల్లవి. ఒక హీరోయిన్ తన తొలి సినిమాతో అంత పేరు సంపాదించడం అరుదు. తెలుగులో అందంతో బలమైన ముద్ర వేసిన వాళ్లున్నారు కానీ.. నటనతో అంత పేరు సంపాదించింది మాత్రం సాయిపల్లవే అయి ఉంటుంది. ఆమె రెండో సినిమా ‘ఎంసీఏ’ కూడా హిట్టవడంతో ఆమెది గోల్డెన్ లెగ్ అని అంటున్నారు సినీ జనాలు. ఈ ఊపులో సాయిపల్లవికి మంచి అవకాశాలు వస్తున్నాయి. తన పారితోషకం కూడా భారీగానే ఉంటోందని సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కోసం సాయిపల్లవి రూ.1.4 కోట్ల దాకా పారితోషకం అందుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం గ్లామర్ ఉన్న స్టార్ హీరోయిన్లు మాత్రమే ఈ స్థాయిలో పారితోషకం తీసుకుంటారు. ఐతే సాయిపల్లవి గ్లామర్ తో ఎప్పుడూ పెద్దగా ఆకర్షించింది లేదు. ‘ప్రేమమ్’ దగ్గర్నుంచి ఆమె నటనే సినిమాలకు ఆకర్షణ అవుతోంది. ఇలా నటనా కౌశలంతోనే క్రేజ్ సంపాదించుకుని ఇంత పారితోషకం తీసుకోవడమంటే గొప్ప విషయమే. త్వరలోనే సాయిపల్లవి కొత్త సినిమా ‘కణం’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమా కూడా ఆమెకు మంచి పేరే తెస్తుందని భావిస్తున్నారు. మరోవైపు తమిళంలో సూర్య లాంటి పెద్ద హీరో.. సెల్వ రాఘవన్ లాంటి విలక్షణ దర్శకుడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండటం విశేషం. మొత్తంగా ఈ మలయాళీ భామ కెరీర్ మాంచి ఊపు మీదే ఉందిప్పుడు.