మహిళలకి హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అంటున్న సాయిపల్లవి

Update: 2020-02-20 17:30 GMT
హెచ్‌ ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టెస్సీ థామస్‌, సినీనటి సాయిపల్లవితో పాటు పలువురు పాల్గొన్నారు. మహిళల భద్రత, ఇతర అంశాలపై ఈ సదస్సులో చర్చించారు. సైబరాబాద్‌ ఐటీ కారిడార్‌ పరిధిలోని మహిళా ఉద్యోగుల భద్రత కోసం రూపొందించిన షీ సేఫ్‌ అనే ప్రత్యేక యాప్‌ను సాయిపల్లవి ప్రారంభించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ... మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని, మహిళలకు హైదరాబాద్‌లో ఉన్న భద్రత మరెక్కడా లేదని , పోలీసుల భద్రతతో మహిళలు నిశ్చింతగా ఉంటున్నారని తెలిపారు. చదువు, ఉద్యోగాల కోసం సిటీకి వచ్చే మహిళలు, యువతులు, వారి తల్లిదండ్రులు భయపడేవారని కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని , అలాగే మనం కూడా పోలీసులకి సహాయంగా నిలవాలని అన్నారు. ఇకపోతే , ఫిదా సినిమా తో అందరిని ఫిదా చేసిన ఈ భామ ..ప్రస్తుతం నాగచైతన్య హీరో గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమా లో నటిస్తుంది. ఈ సినిమా ఈ సమ్మర్‌లో విడుదల అవ్వబోతుంది. అలాగే తమిళంలో ధనుష్ సరసన ఒక సినిమాలో నటిస్తుంది.




Tags:    

Similar News