అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా?

Update: 2021-04-04 14:30 GMT
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా?.. .. అలుసైపోయనా అసలేమి కానా.. వేషాలు చాల్లే పొమ్మనా..! .. యాథృచ్ఛికంగానే అయినా కానీ ఈ పాట సృజ‌న వెన‌క శేఖ‌ర్ క‌మ్ముల అండ్ టీమ్ క్రియేటివిటీని మ‌రోమారు గుర్తు చేసుకోవాల్సిన సంద‌ర్భ‌మిది. ఒక సాయం సంధ్య‌లో చీక‌టి ముసురుకుంటుండ‌గా సుమంత్- క‌మ‌లినీ ముఖ‌ర్జీ జంట‌పై న‌దీ తీరాన‌ చిత్రీక‌రించిన ఈ పాట ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది.

క‌మ్ముల మైండ్ లో ఉద్భ‌వించే క‌థానాయిక ఇంచుమించు అంతే అందంగా హాయిగా ఆహ్లాదంగానే క‌నిపిస్తుంది ప్ర‌తిసినిమాలో. మొన్న బ్లాక్ బ‌స్టర్ ఫిదాలో.. ఇప్పుడు ల‌వ్ స్టోరిలో సాయి ప‌ల్ల‌వి అంతే అందంగా ముచ్చ‌ట‌గా క‌నిపిస్తోంది. తాను అంద‌గ‌త్తెను కాను అని నిజాయితీగా అంగీక‌రించే సాయి ప‌ల్ల‌వికి గోదావ‌రిలోని ఆ పాట సూట‌వుతుందేమో.. కానీ త‌న డ్యాన్సుల ముందు ప్ర‌తిభ ముందు అందం చిన్న‌బోతోంది.

త‌న హీరోలు ఎన్నిసార్లు క‌నిపించినా తేలేని ఊపు సాయిప‌ల్ల‌వి తెస్తోంది. ఒక్క సారంగ ద‌రియా బ‌య‌టికి వ‌చ్చే వ‌ర‌కూ అస‌లు ల‌వ్ స్టోరి గురించి ఎవ‌రూ మాట్లాడ‌లేదు. సారంగ‌ద‌రియాలో సాయిప‌ల్ల‌వి మ్యాజిక్ వ‌ర్క‌వుట‌వ్వ‌గానే అంతా ఆ సినిమా గురించే ముచ్చ‌టిస్తున్నారు. మ‌రి ఇప్పుడు ఇలా చీర క‌ట్టుకుని అలా ముసిముసిగా న‌వ్వులు చిందిస్తూ అందంగా లేనా అస‌లేమీ కానా! అంటే ఎవ‌రూ ఊరుకోరు. ``ఫ‌ర్ ల‌వ్ స్టోరి ప్ర‌మోష‌న్స్ మిస్ P`` అంటూ స్టైలిష్ట్ నీర‌జ కోన ఈ ఫోటోని షేర్ చేశారు. చూడ‌గానే ముచ్చ‌ట‌గొలుపుతోంది. అంత అందంగా డిజైన్ కుదిరింది. నీర‌జ స్టైలింగ్ నిజంగానే అదిరిపోయింది సుమీ!



Tags:    

Similar News