శర్వానంద్ - రష్మిక జంటగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. మార్చి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా సుకుమార్ .. కీర్తి సురేశ్ .. సాయిపల్లవి హాజరయ్యారు. ఈ వేదికపై సాయిపల్లవి మాట్లాడటానికి రాగానే .. అక్కడి అభిమానులు ఈలలు .. కేకలతో సందడి చేశారు.
అప్పుడు సాయిపల్లవి .. "ఈ రోజున నేను ఎక్కడ ఏడిస్తే బాగుండదు .. ఇక్కడికి నేను గెస్టుగా రాలేదు. నా ఫ్యామిలీ ఈవెంట్ కి వచ్చినట్టుగానే ఉంది. ఎందుకంటే 'పడి పడి లేచే మనసు' చేసిన దగ్గర నుంచి సుధాకర్ గారు .. శ్రీకాంత్ గారు నా ఫ్యామిలీ అయిపోయారు. ఆర్టిస్టుల గురించి వాళ్లు ఎంతమంది మనసుతో ఆలోచిస్తారనేది నాకు తెలుసు. వాళ్లకి ఈ సినిమా మంచి సక్సెస్ ను తీసుకుని రావాలని కోరుకుంటున్నాను. వాళ్లు ఆశించినట్టుగానే మీరంతా థియేటర్ కి వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
ఇక శర్వానంద్ విషయానికి వస్తే ఆయనతో నేను ఒక ఫ్రెండ్ లా మాట్లాడేస్తూ ఉంటాను. తాను ఎప్పుడూ కూడా నేను హీరోను అయిపోయాను కదా అనుకోడు. ఎప్పటికప్పుడు తన పాత్రను బాగా చేయాలనే ఉద్దేశంతో ఆయన కష్టపడుతూనే ఉంటాడు. తన పాత్రను ఇంకా ఇంకా బెటర్ గా చేయడం కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే శర్వానంద్ ఎంత బాగా చేశాడనే విషయం నాకు అర్థమైపోతోంది.
ఈ సినిమా ట్రైలర్ లో చూస్తేనే దర్శకుడిగా తిరుమల కిశోర్ గారు .. దేవిశ్రీ పసాద్ గారు ఎంతగా కష్టపడ్డారనేది తెలిసిపోతోంది. రష్మిక విషయానికి వస్తే .. ఎప్పుడు చూసినా .. ఎక్కడ చూసినా ఫేస్ లో స్మైల్ కనిపిస్తూనే ఉంటుంది. సాధారణంగా అప్పుడప్పుడు అలసిపోయినట్టు కనిపిస్తుంటాము. కానీ తాను ఎక్కడ చూసినా నవ్వుతూనే కనిపిస్తోంది.
ఆ నవ్వు హార్ట్ ఫుల్ గా ఉంది .. బ్యూటిఫుల్ గా ఉంది. 'పుష్ప'తో సక్సెస్ అందుకున్నందుకు ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నాను .. ఈ సినిమాతో సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను"అంటూ చెప్పుకొచ్చింది