`ఫిదా` బ్యూటీ సాయిపల్లవి క్షణం తీరిక లేని షెడ్యూళ్లతో కెరీర్ పరంగా ఫుల్ స్వింగులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అదేమీ ఫ్యామిలీతో సమయం గడిపేందుకు అడ్డంకి కలగకుండా జాగ్రత్త పడడంలో తన తర్వాతనే. వీలున్నంతవరకూ కుటుంబ సభ్యులతో గడిపేందుకు సాయి పల్లవి తన విలువైన సమయాన్ని కేటాయిస్తుంది.
తాజాగా సాయి పల్లవి తన తాత- అమ్మమ్మలతో కలిసి ఉన్న అరుదైన ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేయగా వైరల్ గా మారాయి. సాయి పల్లవి తన తాతతో కలిసి విడిగా దిగిన ఫోటోలు అమ్మమ్మతో దిగిన ఫోటోలే కాదు.. తన గారాల కుట్టి చెల్లెలితో కలిసి దిగిన ఫోటోలను సాయి పల్లవి షేర్ చేసింది. తన తాతగారి 85 వ పుట్టినరోజు వేడుకల్లో ఈ సిత్రాలన్నీ బయటపడ్డాయి. పుట్టినరోజు వేడుకల్లో సాయిపల్లవి షో స్టాపర్ గా నిలిచింది. సంప్రదాయ చీర కట్టులో తళుక్కుమంది. సాయిపల్లవి ఇన్ స్టాలోకి ఈ ఫోటోలు చేరగానే వైరల్ గా దూసుకెళ్లాయి. ఫిదా నటి
ఈ వేడుకల్లో నీలం రంగు పట్టు చీర ధరించి సాయిపల్లవి ఎంతో అందంగా కనిపిస్తోంది. వేడుకల నుండి ఆమె అమ్మమ్మ .. సోదరి విడివిడిగా చిత్రాలను కూడా పంచుకుంది. సాయి పల్లవి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కి రాశి ఖన్నా నుంచి స్వీటెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. `అందం` అంటూ సింపుల్ క్యాప్షన్ ఇచ్చారు. బాలీవుడ్ నటి సాన్యా మల్హోత్రా ఒక హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసారు. రాశి ఖన్నా పోస్ట్ కి సాయి పల్లవి ధన్యవాదాలు తెలిపింది.
సాయి పల్లవి కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవల నాని నటించిన శ్యామ్ సింఘ రాయ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆమె లవ్ స్టోరీ విడుదల కోసం ఎదురుచూస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటించారు. రానా దగ్గుబాటి సరసన నటింఇన విరాట పర్వం రిలీజ్ కి రావాల్సి ఉంది. లవ్ స్టోరీ - విరాట పర్వం వరుసగా ఏప్రిల్ 16 - ఏప్రిల్ 30 న విడుదల కావాల్సి ఉండగా... కరోనావైరస్ మహమ్మారి రెండవ వేవ్ కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
పాత్ర నచ్చకపోతే తగ్గేదేలే..!
ప్రస్తుతం కెరీర్ పరంగా క్షణం తీరిక లేని సాయిపల్లవి ఎంతో సెలెక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తాను ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి ప్రధాన బలం అని నిరూపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం..కొద్ది రోజుల క్రితం ఒక ప్రముఖ నిర్మాత తన తదుపరి చిత్రంలో నాయికా ప్రధాన పాత్రను పోషించడానికి భారీ పారితోషికం ఆపర్ చేశారట. కానీ తన పాత్ర నచ్చకపోవడంతో సాయి పల్లవి నిర్మాతకు మొహమాటం అన్నదే లేకుండా `నో` చెప్పి పంపించారట. ఏదైనా తనకు బలమైన పాత్ర ఉంటేనే తన వద్దకు ప్రాజెక్టులను తీసుకురావాలని తన బృందానికి తెలియజేసారట. డబ్బు తనకు మ్యాటర్ కానే కాదని క్లారిటీనిచ్చింది. కెరీర్ లో ఇప్పటివరకూ తనకు నచ్చనివి పెద్ద బ్యానర్ల సినిమాలు ఓ పది వరకూ ఇలానే వదులుకుందన్న టాక్ ఉంది. ఇక ఇంతకుముందు హీరోలతో ఏదైనా విషయంలో కుదరకపోతే నిర్మొహమాటంగా ఆ విషయం వారికి చెప్పేసి కూడా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసినదే.