కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చిన సాయిధ‌ర‌మ్‌ తేజ్

Update: 2022-03-26 14:39 GMT
మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 10 న హైదరాబాద్ లోని గ‌చ్చిబౌలీ లో బైక్ స్కిడ్ కావ‌డంతో యాక్సిడెంట్ కు గురైన విష‌యం తెలిసిందే. ప్రమాదం జ‌రిగిన వెంట‌నే అప‌స్మార‌క స్థితిలోకి వెళ్ల‌డంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ ని స‌మీపంలో వున్న ఆసుప‌త్రికి అబ్దులు ఫ‌య్య‌ద్ అనే వ్య‌క్తి త‌ర‌లించ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. 30 రోజుల పాటు ఆసుప‌త్రిలోనే వుండి ప్ర‌త్యేకంగా చికిత్స పొందిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆ త‌రువాత క్షేమంగా ఇంటికి తిరికి వ‌చ్చారు.

అప్ప‌టి నుంచి ఇంటి ప‌ట్టునే వుంటున్న ఆయ‌న మీడియా ముందుకు మాత్రం రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. స్టైలిష్ ఫొటో షూట్ ల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేస్తూ త‌న అభిమానులకు నిత్యం ట‌చ్ లో వుంటూ వ‌స్తున్న ఆయ‌న తాజా ఓ వీడియోని విడుద‌ల చేశారు.

గ‌త ఆరు నెల‌లుగా ఇంటి ప‌ట్టునే వుంటున్న తాను చాలా నేర్చుకున్నాన‌ని, కృత‌జ్ఞ‌త గురించి, హ్యాపీగా వుండ‌టం గురించి, హెల్త్ గురించి, అలాగే ఫ్యామిలీ గురించి చాలా నేర్చుకున్నాను అన్నారు.

ఈ సంద‌ర్భంగా త‌న‌ని ఆసుప‌త్రిలో చేర్చిన స‌య్య‌ద్ అబ్దుల్ ఫారాక్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. నీ వ‌ల్లే నేను ఇప్పుడు ఇక్క‌డ వున్నాను. మాన‌వ‌త్వం ఇంకా బ‌తికి వుందంటే దానికి నిలువెత్తు నిదర్శ‌నం మీరే అని త‌న‌ని కాపాడిన వ్య‌క్తికి, త‌న‌ని బాగా చూసుకున్న ఆసుప‌త్రి వ‌ర్గాల‌కు, కుటుంబ స‌భ్యుల‌కు, త‌ను కోలుకోవాల‌ని కాలిన‌డ‌క‌న తిరుప‌తి కొండ ఎక్కిన అబిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు సాయి ధ‌ర‌మ్ తేజ్‌.

ఫైన‌ల్ గా ఈ వీడియోని ఎందుకు విడుద‌ల చేయాల్సి వ‌చ్చిందో క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 28న త‌న కొత్త సినిమా ప్రారంభం అవుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ అండ్ SVCC బాబీ ఈ మూవీని నిర్మిస్తున్నార‌ని తెలియ‌జేశారు సాయి ధ‌ర‌మ్ తేజ్‌.

ఈ మూవీ హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్క‌బోతోంది. కార్తీక్ వ‌ర్మ దండు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కొన్ని నెల‌ల క్రితం ఈ మూవీకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు కూడా.


Full View

Tags:    

Similar News