సెలబ్రెటీల పెళ్లవగానే వారి సంతానం గురించి మీడియాలో చర్చ జరుగుతుంది. బిడ్డ పుట్టగానే పేరు గురించి డిస్కషన్ మొదలవుతుంది. ఆ పేరేదో బయటికి వచ్చాక దానికి అర్థమేంటి.. ఏ ఉద్దేశంతో ఈ పేరు పెట్టారని చర్చలు జరుగుతాయి. సైఫ్ అలీ ఖాన్.. కరీనా కపూర్ తన కొడుకు విషయంలోనూ ఇలాంటి డిస్కషనే నడిచింది. ఆ బాలుడికి తైమూర్ అలీఖాన్ పటౌడీ అనే పేరు పెట్టడం మీద పెద్ద వివాదమే నడిచింది. ఒకప్పుడు భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన టర్కీ రాజు పేరు తైమూర్. దీంతో అలాంటి పేరెందుకు పెట్టారంటూ సైఫ్.. కరీనా దంపతులపై నెటిజన్లు మండిపడ్డారు. ఐతే వాళ్లిద్దరూ ఈ విషయమై తమ స్పందనేంటో తెలియజేయలేదు. సైలెంటుగా ఉండిపోయారు.
ఐతే ఎట్టకేలకు సైఫ్ ఈ విషయంలో నోరు విప్పాడు. తన కొడుకు అందరూ అనుకుంటున్న ‘తైమూర్’ కాదని అతను స్పష్టం చేశాడు. కొడుకు పేరులో ఉన్న మతలబును అతను ట్విట్టర్లో వివరించాడు సైఫ్. ‘‘చరిత్ర గురించి నాకు అవగాహన ఉంది. మన దేశంపై దాడి చేసింది టర్కీ రాజు తైమూర్ (Timur). ఐతే నా కొడుకు పేరు తాయ్ మూర్ (Taimur). ఇది పర్షియన్ పేరు. ఈ పేరుకు ‘ఉక్కు’ అనే అర్థం వస్తుంది. ఈ పేరు నాకు.. నా భార్య కరీనాకు ఇష్టం’’ అని సైఫ్ తెలిపాడు. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు కామెంట్లు చేయొచ్చని.. ఐతే హేట్ పోస్టులు పెట్టడం మాత్రం తప్పని సైఫ్ అన్నాడు. తన కొడుకు పేరుకు సంబంధించిన వివాదంలో తనకు చాలామంది మద్దతుగా నిలిచారని.. వారికి కృతజ్నతలని సైఫ్ చెప్పాడు.