సినీ ఇండస్ట్రీలో పేమెంట్స్ విషయంలో హీరోయిన్లకు తక్కువ - హీరోలకు ఎక్కువ అనే నియమం సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇది వరకూ కొంతమంది గళమెత్తారు. పలువురు నటీమణులు మాట్లాడుతూ.. తమకూ హీరోల సమాన స్థాయి పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఇండస్ట్రీలో పరిస్థితి మాత్రం మారడం లేదు.
హీరోలకు సమానమైన - హీరోల కన్నా ఎక్కువ పారితోషికం తీసుకునే నటీమణులు చాలా చాలా తక్కువమంది ఉన్నారు. దేశంలోని అన్ని భాష చిత్ర పరిశ్రమల పోకడనూ గమనించినా.. ఒకరిద్దరు మాత్రమే అలా హీరోలకు ధీటైన పారితోషకం అందుకుంటున్నారు. సౌత్ లో అయితే మరీ దారుణం. హీరోల కన్నా చాలా చాలా తక్కువ పారితోషికాన్ని హీరోయిన్లకు ఇస్తున్నారు.
సినిమాలకు హీరో ఎంత ఇంపార్టెంటో - హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమాలను హీరోయిన్లే తమ గ్లామర్ తో కాపాడుతూ ఉంటారు. కానీ పారితోషకం విషయంలో వారు వెనుకబడే ఉన్నారు. ఇలాంటి క్రమంలో వారి పారితోషకం గురించి గళం విప్పాడు సైఫ్ అలీఖాన్.
నిజానికి హీరోల కన్నా హీరోయిన్లకే ఎక్కువ పారితోషకం ఇవ్వాలని సైఫ్ అంటున్నాడు. వారి కష్టం ఎక్కువగా ఉంటుందని, వారు మాత్రం తక్కువ పారితోషకం పొందుతున్నారని సైఫ్ చెబుతున్నాడు. ఇలా నటీమణుల తరఫున గళం విప్పాడు ఈ హిందీ నటుడు. ఈ విషయంలో మిగతా బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తారేమో చూడాలి!