తెలుగు సినిమాలే కాదు హిందీ సినిమాలు కూడా ఈమధ్య కొత్తపుంతలు తొక్కుతున్నాయి. కొంతమంది నటులైతే అటు సినిమాలు ఇటు వెబ్ సీరీస్ లతో ప్రయోగాలు చేస్తున్నారు. కియారా అద్వాని లస్ట్ స్టొరీస్ అంటే సైఫ్ అలీ ఖాన్ సేక్రేడ్ గేమ్స్ వెబ్ సీరీస్ అన్నాడు. ఇప్పుడు తాజాగా సైఫ్ 'హంటర్'(వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో బందిపోటు లా కనిపిస్తాడట.
ఈ సినిమాలో సైఫ్ గెటప్ రీసెంట్ గా లీకయింది. ముంబై లో ని ఫైల్మిస్తాన్ స్టూడియో లో షూటింగ్ జరుగుతూ ఉంటే ఎవరో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారట. ఇంకేముంది... దెబ్బతో నవాబ్ పటౌడి గారి క్రూరావతారం వైరల్ అయింది. అసలు దువ్వకపోవడంతో జడలు కట్టిన పొడావాటి జుట్టు.. అదేదో కాలం నాటి వెరైటీ డ్రెస్.. కింద ధోతి పైన బ్రిటిష్ యూనిఫాం లాంటి బటన్లు విప్పిన జాకెట్ - తలకు ఒక తలపాగా టైప్ లో మాసిన టవల్ ను ముడేసుకున్నాడు. ఇక రాజుల కాలం నాటి పాయింటెడ్ బూట్లు.. మాసిన బట్టలతో పెరిగిన గడ్డం మీసాలతో అఘోర టైప్ బందిపోటులా ఉన్నాడు.
ఎవరో కనుక చెప్పకపోతే ఈ మనిషి సైఫ్ అలీ ఖాన్ అని కనుక్కోవడం కూడా కష్టం. నవదీప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో R. మాధవన్ - సోనాక్షి సిన్హాలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్కడేమో ఆమీర్ ఖాన్ తాజా చిత్రంలో బందిపోటులా నటిస్తుంటే.. ఇక్కడ సైఫ్ కూడా ఇంకో బందిపోటు గెటప్ లో ఉన్నాడు. బాలీవుడ్ కి బందిపోటుల సీజన్ వచ్చిందేమో!