కేవలం పేరుకే రాజు కాదు... ఆ మధ్య పటౌడీల వంశంలో రాజుగా పట్టాభిషిక్తుడు సైతం అయ్యాడు సైఫ్ అలీఖాన్. భారత దేశం బ్రిటీష్ వారి పాలు కాకముందు పటౌడీలు కూడా కొంత ప్రాంతాన్ని పాలించారు. బ్రిటీష్ వారు దేశంలో పాలన స్వాధీనం చేసుకున్నాకా .. పటౌడీల పాలన నామమాత్రంగా మారింది. బ్రిటీషర్లతో సఖ్యతగానే నడుచుకుంటూ వచ్చారు వీళ్లు. ఆ క్రమంలో టైగర్ పటౌడీ క్రికెటర్ అయ్యాడు. బ్రిటీషర్ల ద్వారా అటలో మెలకువలు సంపాదించాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ కూడా అయ్యాడు. స్టార్ క్రికెటర్ గా కొనసాగాడు.
అలా క్రికెటర్ గా కొనసాగుతున్నా.. పేరుకు టైగర్ పటౌడీ తమ వంశంలో రాజుగా బాధ్యతలు తీసుకున్నాడు. వారికి ప్రత్యేకంగా పాలన కంటూ ప్రాంతం లేకపోయినా..తమ కుటుంబ ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో తండ్రి అవసాన దశలో ఉండగా.. సైఫ్ అలీ ఖాన్ రాజుగా పట్టాభిషక్తుడు అయ్యాడు. అదంతా వారి కాంపౌండ్ కే పరిమితమైన అధికారం.
సినిమా హీరోగా కొనసాగుతూ.. సైఫ్ పటౌడీ వంశాచారం ప్రకారం.. రాజు కూడా అయ్యాడు. మరి చెప్పుకోవడానికి ఇంతున్నా.. తన జీవితంలోనూ కష్టాలున్నాయని అంటున్నాడు సైఫ్. ఒక రాజవంశం నుంచి వచ్చాడు. గోల్డెన్ స్పూన్ తో పుట్టి..జీవితమంతా సకల సౌకర్యవంతంగా గడిపాడు. ఆ పై బాలీవుడ్ లోనూ ఇతడికి కలిసి వచ్చింది. మొదటి భార్యకు విడాకులు, ఆ తర్వాత మరో స్టార్ హీరోయిన్ తో పెళ్లి... ముగ్గురు పిల్లలు. ఇలా సైఫ్ జీవితం పూల పాన్పులానే కనిపిస్తుంది. అయితే సైఫ్ మాత్రం తన జీవితంలో కూడా కష్టాలున్నాయని అంటున్నాడు. అయితే అవేమీ తీవ్రమైనవి కాదు అని కూడా ఇతడే చెబుతూ ఉన్నాడు! తీవ్రమైనవి కాకపోయినా.. తన జీవితంలోనూ కష్టాలున్నాయని, వాటిని అధిగమించినట్టుగా చెబుతున్నాడు సైఫ్.