బాలీవుడ్ లో ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న లైంగిక వేదింపులు మీటూ ఉద్యమం పుణ్యమా అని బయటకు వస్తున్నాయి. ఆ ఉద్యమం కారణంగా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది పరువు బజారున పడుతోంది. జూనియర్ ఆర్టిస్టుల నుండి స్టార్ సెలబ్రెటీల వరకు కూడా మీటూ ఉద్యమం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం చేసిన తప్పుకు కూడా ఇప్పుడు బలవ్వాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ మీటూ గురించి స్పందించాడు.
తన కుటుంబంకు చెందిన వారు ఎవరు కూడా లైంగిక వేదింపులు ఎదుర్కోలేదు. నా తల్లి - కూతురు - భార్య ఇండస్ట్రీలో ఉన్నారు. అయినా కూడా వారు ఇప్పటి వరకు ఏ ఒక్కరి ద్వారా వేదింపులను ఎదుర్కోలేదు. వారిని లైంగికంగా వేదించే దమ్ము ఎవరికి లేదు. ఆ సాహసం ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, ఇకపై కూడా ఎవరు చేయరనే నేను అనుకుంటున్నాను అంటూ సైఫ్ అలీ ఖాన్ చెప్పుకొచ్చాడు. వారి చుట్టు ఫేమ్ - ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండటం వల్ల వారి జోలికి ఎవరు రావట్లేదని తాను భావిస్తున్నాను అన్నాడు.
మీటూ ఉద్యమం కారణంగా ఎంతో మంది మహిళలు వర్క్ ఏరియాలో ప్రశాంతంగా పని చేసుకునే వెసులుబాటు ఉంటుందని, ఈ ఉద్యమం కొన్నాళ్లు ఉండి పోదని, భవిష్యత్తులో కూడా మీటూ ఉంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక తన కొడుకు తైమూర్ పై మీడియా ఫోకస్ ఎక్కువ పెట్టడంపై సైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక మోస్తరు ఫోకస్ పర్వాలేదు కాని, పూర్తి శ్రద్ద అంతా కూడా నా కొడుకుపై పెట్టడం నాకు నచ్చడం లేదని, జనాలకు కూడా అది నచ్చక పోవచ్చని సైఫ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.