యాక్షన్ కామెడీ నేపథ్యంలో కార్తికేయ 'రాజా విక్రమార్క' సినిమా చేశాడు. ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించిన సాయికుమార్ మాట్లాడుతూ .. "నేను మేకప్ వేసుకోవడం మొదలుపెట్టి 50 ఏళ్లు అవుతోంది. 50 ఏళ్లు అవుతున్నా ప్రతి సినిమా ఒక న్యూ ఎక్స్ పీరియన్స్ .. ఒక ఎగ్జైట్మెంట్ ఉంటూనే ఉన్నాయి. 'రాజా విక్రమార్క' కూడా నాకు అలాంటి ఎగ్జైట్మెంట్ నే అందిస్తోంది.
శ్రీ సరిపల్లి నా దగ్గరికి వచ్చాడు .. కథ చెప్పి వెళ్లిపోయాడు. నిజంగా ఇది చాలా మంచి కథ. నాకు మా ఆది ఎలాగో ఇప్పుడు వచ్చిన హీరోలంతా కూడా అలాగే. 'ఎస్ ఆర్ కల్యాణ మంటపం' సినిమాతో కిరణ్ ఆల్రెడీ ఒక సక్సెస్ ఇచ్చి ఉన్నాడు. ఆ సక్సెస్ లో కూడా నా భాగం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో కిరణ్ కి ఫాదర్ గా కనిపించిన నేను .. ఇందులో కార్తికేయకి మామగా .. తాన్యకు ఫాదర్ గా చేశాను .. హర్షవర్ధన్ కి ఒక మంచి స్నేహితుడిగా కనిపిస్తాను.
నిజంగా ఇది ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ .. ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అందుకు కారణం న్యూ టాలెంట్. వాళ్లలో హీరోలు .. సంగీత దర్శకులు .. కెమెరామెన్లు .. ఎడిటర్లు .. స్టెంట్ మాస్టర్లు అందరూ ఉన్నారు. ఇక భరణిగారితో .. పశుపతిగారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. కార్తికేయతో కలిసి చేయడానికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. యువ హీరోల్లో ఇప్పుడు మంచి తపన కనిపిస్తోంది. చేసే పని మనసా వాచా కర్మణా చేస్తే రిజల్ట్ అదే వస్తుంది.
ఇప్పుడు హీరోలకు మరో అడ్వాంటేజ్ ఉంది .. హీరోలంతా కూడా కలిసి ఉంటున్నారు. అందరి అభిమానులు అందరి సినిమాలను చూస్తారు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను .. "నాది నాది అంటే పరాయితనం .. మాది మాది అంటే కిరాయితనం .. మనది మనందరిదీ అంటేనే మనతనం .. మంచితనం .. మగతనం". ఇది మన ఇండస్ట్రీ .. ఇది మన సినిమా. నిర్మాతలకు మంచి జరగాలనీ .. పైడితల్లి ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకులు ఆదరించాలని .. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్ని సినిమాలు హౌస్ ఫుల్స్ తో రన్ అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ సినిమా వస్తోంది. అన్ని సినిమాలు బాగుండాలి .. అందులో మన సినిమా కూడా ఉండాలి. అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి" అంటూ ముగించారు.