అక్కినేని నాగార్జున సెప్టెంబర్ తమ కుటుంబానికి బాగా కలిసివచ్చింది అనే మాట ఈ మధ్య పలుమార్లు ప్రమోషన్ ఈవెంట్స్ లో అంటూనే ఉన్నారు. కొడుకు నాగ చైతన్య శైలజారెడ్డి అల్లుడు కోడలు సమంతా యుటర్న్ తన పర్సనల్ దేవదాస్ అన్ని ఒకేనెలలో రావడం విశేషమే. ఆ రకంగా ఇది ప్రత్యేకంగా వాళ్లకు గుర్తుండిపోతుంది కూడా. కానీ నాణేనికి మరో వైపు అన్నట్టు ఈ మూడు సినిమాలు బయ్యర్లను కూడా లాభాల్లో ముంచెత్తి ఉంటే వాళ్లకూ మరపురాని నెలగా మిగిలి ఉండేది. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి.
శైలజారెడ్డి అల్లుడు మిక్స్ డ్ టాక్ తో ఓపెన్ అయినా మొదటి మూడు నాలుగు రోజులు వసూళ్లు బాగానే రాబట్టిన మాట నిజం. కానీ ఆ వెంటనే మొదటి సోమవారం నుంచే విపరీతమైన డ్రాప్ తో చివరికి బ్రేక్ ఈవెన్ అందుకోవడం కూడా కష్టమే అనేలా ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. 24 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలో దూకిన అల్లుడు అంత మొత్తంలో గ్రాస్ మాత్రమే సాధించాడు ఇక సమంతా యుటర్న్ చాలా తక్కువ బడ్జెట్ లో తీసినా టాక్ బాగానే వచ్చినా అది కలెక్షన్ గా మారలేదు. 7 నుంచి 8 కోట్లలోపే బిజినెస్ చేసినప్పటికీ ఆ మొత్తం షేర్ కూడా తెలుగు వెర్షన్ కు రాలేదనేది ట్రేడ్ మాట. భారం మొత్తం సమంతా మీదే ఉండటం మూవీ థీమ్ అందరికి కనెక్ట్ అయ్యేది కాకపోవడం ఫలితం మీద ప్రభావం చూపించాయి.
ఇక మొన్న గురువారం వచ్చిన దేవదాస్ గురించి ఒక అంచనా రావాలంటే మొదటి వారం పూర్తవ్వాలి. ఇద్దరు స్టార్లు ఉన్నారు కాబట్టి సహజంగానే మొదటి నాలుగు రోజుల వీక్ ఎండ్ బాగా రన్ అవుతుంది. దాన్ని బట్టి సినిమా ఫైనల్ స్టేటస్ చెప్పడం కరెక్ట్ కాదు. ఒకవేళ సోమవారం నుంచి కూడా తక్కువ డ్రాప్ తో స్టడీగా ఉంటే దేవదాస్ బయ్యర్లు కుదుటపడవచ్చు. ఇప్పటికైతే అక్కినేని ఫామిలీ మూడు సినిమాలు అవుట్ రైట్ గా అందరిని మెప్పించలేకపోయాయి. సో కుటుంబానికి మెమొరబుల్ గా మారిన సెప్టెంబర్ కొన్నవాళ్లకు మాత్రం కాలేకపోతోంది. దేవదాస్ ఏమైనా ఎదురు నిలిచి పాస్ అవుతాడా ఇంకో మూడు నాలుగు రోజులు వేచి చూస్తే తెలిసిపోతుంది.