అక్కినేని నాగచైతన్య - అను ఇమ్మాన్యుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'శైలజారెడ్డి అల్లుడు' విడుదలై ఇప్పటికి వారం అయింది. వినాయకచవితి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మొదట్లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ విషయం జోరు చూపించింది. పండగ.. వీకెండ్ శెలవులను ఫుల్ గా వాడుకొని సగానికి పైగా ఇన్ వెస్ట్ మెంట్ ను రికవరీ చేసింది.
కానీ అన్నీ సినిమాలకు పరిక్ష మొదలయ్యేది మొదటి సోమవారమే కదా. ఆ టెస్ట్ లో ఫెయిల్ అయింది.. కలెక్షన్స్ లో జోరును కొనసాగించలేక పోయింది. అప్పటినుండి మళ్ళీ రికవర్ కాలేదు. లాస్ట్ టూ డేస్ కలెక్షన్స్ మరింతగా డ్రాప్ అయ్యాయి. మొదటి వారానికి రూ. 16.80 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ వసూలు చేసింది. అంటే ఇప్పటివరకూ 75% పెట్టుబడి వెనక్కు తీసుకొచ్చినట్టు లెక్క. ఈ వీకెండ్ లో కనుక కలక్షన్స్ పుంజుకోలేదంటే డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పవు. కానీ ముప్పావు భాగం పెట్టుబడి ఇప్పటికే వెనక్కు వచ్చింది కాబట్టి అది వారికి కాస్త ఊరటనిచ్చే విషయమే.
మరోవైపు కొన్ని ఏరియాలలో ఈ సినిమా రైట్స్ ను 'అజ్ఞాతవాసి' వల్ల నష్టపోయిన వారికి తక్కువ మొత్తానికి ఇవ్వడం జరిగిందట. వాళ్ళకు మాత్రం మళ్ళీ నిరాశ తప్పదు. మరి ముగ్గురి ఈగోలతో సతమతమైన అల్లుడు అందరినీ ఒడ్డుకు చేరుస్తాడా లేదా అన్నది రెండో సోమవారానికి క్లారిటీ వస్తుంది.