అంతా అనుకూలంగా ఉంటే 'శైలజారెడ్డి అల్లుడు' ఆగష్టు 31 న రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ కేరళ వరదల కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ డిలే కావడంతో సినిమాను వాయిదా వేస్తున్నామని ప్రకటన వచ్చింది. వాయిదా పడినా 'ఆగష్టు 31' మాత్రం ఇంకా వార్తల్లోనే ఉంది. అదేంటంటే డైరెక్టర్ మారుతి ఈ డేట్ కోసం చాలా పోరాడాడట.
ఆ డేట్ కోసం మారుతి ఎవరితో పోటీ పడ్డాడు? డైరెక్టర్ చందు మొండేటితో పోటీ పడ్డాడట. నాగ చైతన్యతో చందూ మొండేటి 'సవ్యసాచి' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా 'శైలజారెడ్డి అల్లుడు' కంటే ముందే విడుదల కావలసింది. కానీ షూటింగ్ డిలే కావడంతో 'శైలజా రెడ్డి అల్లుడు' దాంతో పాటు సీన్ లో కి వచ్చింది. మారుతి -చందు మొండేటి పోటీ పడడంతో ఆ పంచాయితీ నాగార్జున వరకు వెళ్ళిందట. అప్పుడు మారుతి సినిమాకు ఆగష్టు 31 డేట్ దక్కింది.
అక్కినేని వారు మారుతి సినిమాకు వోటేసినా వరుణ దేవుడు మాత్రం కరుణించలేదు. దీంతో ఇప్పుడు సినిమా వాయిదా పడింది. ఫైనల్ గా ఆగష్టు 31 డేట్ మాత్రం మొండేటికీ లేదు మారుతికి లేదు. రెంటికీ చెడ్డ రేవడి అయింది. ఇక ఆ డేట్ ను వేరేవాళ్ళు అందిపుచ్చుకోవడం ఖాయం!