అల్లుడు ఫుల్ గా ఇరుక్కున్నాడే!

Update: 2018-08-23 05:38 GMT
ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు తయారయ్యింది శైలజారెడ్డి అల్లుడి పరిస్థితి. కేరళ వరదలు అక్కడ భీభత్సం సృష్టించడం ఏమో కానీ మారుతీ టీమ్ ని మాత్రం టెన్షన్ తో ముచ్చెమటలు పోయిస్తోంది. ముందు ప్రకటించిన 31 తేదీని వదులుకోవాల్సి రావడం చాలా ఇబ్బందులను సృష్టిస్తోంది. పోనీ ఒక్క వారం ఆలస్యంగా వద్దామంటే ఇప్పటికిప్పుడు వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ జోడించాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్టు వార్త వస్తోంది.  ఇది కనక  నిజమే అయితే దానికి ఎంత లేదన్నా మూడు నాలుగు రోజులైనా కావాలి. పైగా వెన్నెల కిషోర్ రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ కోసం అమెరికాలో ఉన్నాడు. 28కి తిరిగి వస్తున్నాడు. ఎవరికి కాల్ షీట్ ఇచ్చాడో ఇంకా తెలియాల్సి ఉంది. సో వచ్చిన వెంటనే ఎయిర్ పోర్ట్ నుంచి సెట్ తీసుకెళ్లలేరుగా. ఒకవేళ తీసినా ఆ సీన్స్ తాలూకు డబ్బింగ్ రీ రికార్డింగ్ అన్ని పూర్తి చేస్తే కానీ సెన్సార్ కు వెళ్లే ఛాన్స్ ఉండదు. ఇది వద్దు అనుకుంటే ఏ రిస్క్ ఉండదు. హ్యాపీగా సెప్టెంబర్ 7న విడుదల చేసుకోవచ్చు. కానీ 31లాగా సోలో ఛాన్స్ ఉండదు. సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే-రానా నిర్మించిన కేరాఫ్ కంచరపాలెం-సునీల్ అల్లరి నరేష్ ల సిల్లీ ఫెలోస్-థ్రిల్లర్ మను-శరత్ మరార్ ప్రేమకు రైన్ చెక్ అన్ని అదే తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. సో థియేటర్ల విషయంలో కొంత రాజీ పడాల్సి ఉంటుంది.

ఇదంతా ఎందుకు సెప్టెంబర్ 13న వచ్చేద్దాం అనుకుంటే సమంతా యు టర్న్ అదే తేదీకి అధికారికంగా ప్రకటించి యు ఎస్ ప్రీమియర్ షో టైమింగ్స్ కూడా వేసేసారు. సో డ్రాప్ కావడం అసాధ్యం. ఎంత భర్త సినిమా అయినా తన మాట మీద వాయిదా వేయించే వెసులుబాటు సమంతాకు  ఉంటుంది అనుకోలేం. పైగా అది తమిళ్ లో కూడా ప్లాన్ చేసారు కాబట్టి అడ్జస్ట్ మెంట్ కుదరదు. ఈ చిక్కులు ఎందుకు మూడు లేదు నాలుగో వారం చూసుకుందాం అంటే నాగార్జున నానిల మల్టీ స్టారర్ దేవదాస్  లాస్ట్ వీక్ కోసం రెడీ అవుతోంది. సెప్టెంబర్ 20 కొంత బెటర్. విక్రమ్ సామీ స్క్వేర్ తప్ప పెద్ద హడావిడి లేదు. ఈ గందరగోళంలో అల్లుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. మరోపక్క చైతు ఫ్యాన్స్ కూడా అయోమయంలో ఉన్నారు. కేరళ వరదలు అయిపోయి పరిస్థితి కుదుట పడింది కదా ఇప్పటికైనా స్పష్టంగా డేట్ ప్రకటించమని కోరుతున్నారు కానీ క్లారిటీ రావడానికి మరో వారం పైనే పట్టేలా ఉంది.
Tags:    

Similar News