మారుతీ బ్రాండ్ తగ్గిందా!

Update: 2018-09-04 06:38 GMT
ఏదైనా ఒక పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఈ సినిమాను ఆదరించారు కాబట్టి పదే పదే దాన్నే ఒక ఫార్ములాగా మార్చి తీసేవాళ్ళు ప్రతి ఇండస్ట్రీలో కనిపిస్తూనే ఉంటారు. పబ్లిక్ పల్స్ పట్టుకుని ఎప్పటికప్పుడు అప్ డేట్ అయితే ఎలాంటి సమస్య ఉండదు. అలా కాకుండా తాము చూసిందే  ప్రపంచం అనుకుంటేనే అసలు సమస్య.ఈ సంగతి అలా ఉంచితే దర్శకుడు మారుతీ మహానుభావుడు తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న శైలజారెడ్డి అల్లుడు ఈ నెల 13న విడుదల కానుంది. విచిత్రంగా నాగ చైతన్య లాంటి హీరో ఉన్నప్పటికీ పోటీ అంతగా అనిపించినప్పటికీ ఉండాల్సిన రేంజ్ లో హైప్ అయితే లేదు. భలే భలే మగాడివోయ్ తో తనకంటూ ఫామిలీ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న మారుతీ ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్ళి మెప్పించలేకపోయాడు. హీరోకు ఏదో ఒక విచిత్రమైన లోపం ఉండే ఫార్ములాతో పదే పదే రాస్తున్న మారుతీకి తాను రచన చేసిన బ్రాండ్ బాబు ఘోరంగా దెబ్బ తినడం నిజంగా ఊహించనిది.

ఇదంతా శైలజారెడ్డి అల్లుడు మీద ప్రభావం చూపించలేదా అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొంతమేర ఉందన్నది వాస్తవం. ప్రస్తుతం వాడటం మానేసిన అత్తా అల్లుళ్ళ ఫార్ములాలో మాస్ సినిమా ట్రై చేసిన మారుతీ ఇందులో ఎంత వరకు సక్సెస్ అయ్యాడో వచ్చే వారం తేలుతుంది. గతంలో వెంకటేష్ లాంటి స్టార్ హీరో ఇచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోలేకపోయిన మారుతీ దర్శకత్వం వహించకుండా కేవలం రచన చేసిన రోజులు మారాయి లాంటివి రోజులు కూడా ఆడలేదు. షూటింగ్ ఎప్పుడో పూర్తయిన భలే మంచి చౌక బేరం బిజినెస్ జరగక వాయిదా పడుతోందని టాక్. మారుతీ అనే పేరు నిర్మాతగా అయినా దర్శకుడిగా అయినా ఉంటే చాలు సినిమా హాట్ కేక్ లా అమ్ముడుపోయే  పరిస్థితి ఇప్పుడు లేదు. సో శైలజారెడ్డి అల్లుడి సక్సెస్ చాలా కీలకంగా మారబోతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా  ముందు ప్రాజెక్ట్ కు ఇబ్బంది వస్తుంది. ఇప్పటికే కమిట్ అయ్యాడు కానీ అది ఎవరితో అనేది చెప్పకుండా మారుతీ సస్పెన్స్ మైంటైన్ చేస్తున్నాడు.
Tags:    

Similar News