మరో మూడు రోజుల్లో వెండితెరపై సందడి చేయబోతున్న శైలజారెడ్డి అల్లుడు హీరో నాగ చైతన్యకు మాస్ హీరోగా కొత్త ఇమేజ్ తీసుకొస్తుందని అభిమానులు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సమంతా యుటర్న్ పోటీలో ఉన్నప్పటికీ అది పూర్తిగా వేరే జానర్ కావడంతో ఓపెనింగ్స్ విషయంలో చాలా ధీమాగా ఉంది యూనిట్. ఇప్పటిదాకా మాస్ సినిమాల పరంగా బలమైన ముద్ర వేయలేకపోయిన చైతు దీంతో అది సాధిస్తాడనే నమ్మకంతో ట్రేడ్ కూడా బాగానే పెట్టుబడులు పెట్టింది. కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే పాతిక కోట్ల దాకా సితార సంస్థ అమ్మేసినట్టుగా సమాచారం. ఇది చైతు కెరీర్లో ఇప్పటిదాకా జరిగిన ప్రీ రిలీజ్ లో వచ్చిన అత్యధిక మొత్తం. పండగ సెలవు కావడంతో పాటు గురువారం విడుదల కాబట్టి లాంగ్ వీక్ ఎండ్ కలిసి వస్తుంది. టాక్ బాగా వస్తే నాలుగు రోజుల పాటు హౌస్ ఫుల్స్ ని చూసుకోవచ్చు. అందుకే కాస్త ఎక్కువ మొత్తమే అయినా బయ్యర్లు వెనుకాడలేదని టాక్. ఇక ఏరియాల వారీగా అమ్మిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజామ్ - 6 కోట్ల 50 లక్షలు
సీడెడ్ - 3 కోట్ల 25 లక్షలు
ఉత్తరాంధ్ర - 2 కోట్ల 40 లక్షలు
ఈస్ట్ గోదావరి - 1 కోటి 55 లక్షలు
వెస్ట్ గోదావరి - 1 కోటి 30 లక్షలు
కృష్ణా - 1 కోటి 45 లక్షలు
గుంటూరు - 1 కోటి 75 లక్షలు
నెల్లూరు - 80 లక్షలు
తెలుగు రాష్ట్రాలు కలిపి - 19 కోట్లు
రెస్ట్ అఫ్ ఇండియా - 2 కోట్ల 20 లక్షలు
ఓవర్ సీస్ - 3 కోట్ల 50 లక్షలు
ప్రపంచవ్యాప్త బిజినెస్ - 24 కోట్ల 70 లక్షలు (అంచనా)
ఇప్పుడు చైతు గురి పెద్ద టార్గెట్ మీదే ఉంది. 25 కోట్లకు పైగా షేర్ దాటిస్తే శైలజారెడ్డి అల్లుడు లాభాల్లోకి అడుగు పెడుతుంది. సూపర్ హిట్ టాక్ వస్తే అదేమంత కష్టం కాదు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఇది చాలా ఈజీ - గీత గోవిందం పెద్ద స్టార్లు లేకుండానే పాతిక రోజుల్లో అరవై కోట్ల షేర్ రాబట్టడం చూసాం . అందులో సగం తెచ్చుకున్నా చాలు శైలజారెడ్డి అల్లుడు బంపర్ హిట్ క్యాటగిరీలో పడిపోతుంది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రమ్యకృష్ణ నరేష్ లు అత్త మామలుగా అను ఇమ్మానియేల్ జోడిగా నటించారు. గోపి సుందర్ ఆడియో ఇప్పటికే విడుదల కాగా అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరు మీదున్నాయి.