ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆటలో ఎన్నో విజయాలు దక్కించుకుంది. ఆమె దక్కించుకున్న విజయాలు కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలిచాయి. ఆమె బయోపిక్ ను సినిమాగా తీసుకు వచ్చి ఆమె జీవితాన్ని కోట్లాది మందికి ఆదర్శంగా చేయాలని బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భావించారు. అందుకోసం పరిణీతి చోప్రా ను సైనా పాత్రకు ఎంపిక చేయడం జరిగింది. అమోల్ గుప్త దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సైనా జీవితంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలం అయ్యిందంటూ రివ్యూలు వచ్చాయి. దాంతో సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా విడుదలైన 'సైనా' సినిమా రెండు రోజుల్లో కూడా కనీసం కోటి రూపాయలు వసూళ్లు చేయలేక పోయిందట. సైనా సినిమా పై జనాల్లో ఆసక్తి కల్పించడంలో మేకర్స్ పూర్తిగా విఫలం అయ్యారు.
సైనా బయోపిక్ 'సైనా' ఫిల్మ్ మేకర్స్ రెండు విషయాల్లో గుణ పాఠం నేర్పుతుంది. ఎంతటి స్టార్ బయోపిక్ అయినా ప్రమోషన్ చేస్తేనే జనాల్లోకి వెళ్లుంది. సినిమాను ప్రమోట్ చేయకుండా అంత సులభంగా విడుదల చేయడం వల్ల ఓపెనింగ్స్ నష్టపోవాల్సి ఉంటుంది. భారీ పబ్లిసిటీ చేస్తే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓపెనింగ్ వసూళ్లు ఉంటాయి. ఇక బయోపిక్ ను కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. డాక్యుమెంటరీలను ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ చూడాలని కోరుకోరు. ఈ రెండు విషయాలు రాబోయే రోజుల్లో రాబోతున్న సినిమాలకు గుణపాఠంగా నిలుస్తుందని ఆశిద్దాం. మొత్తానికి సైనా సినిమా ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా బాలీవుడ్ లో నిలిచింది.