సైనా పెళ్లి వార్తలందుకే వస్తున్నాయట!

Update: 2018-09-30 10:49 GMT
ఒక బయోపిక్ తీయాలంటే సెలబ్రిటీ స్టొరీ మాత్రం అయితే సరిపోదు.  ఆ సెలబ్రిటీ జీవితంలో ఒడిదొడుకులు..  ఎత్తుపల్లాలు.. ఛాలెంజ్ లు.. గెలుపు అన్నీ ఉండాలి.  వీటన్నిటికి తోడు డ్రామా కూడా ఉండాలి.   అలా కాకుండా 'కష్టపడ్డారు... సాధించారు'... అన్నట్టుగా ఉంటే ఉప్పు కారం లేని కూరలా ఉంటుంది.  అందుకేనేమో ఎఎన్నార్ బయోపిక్ గురించి నాగార్జునను అడిగితే ఓపెన్ గా 'నాన్నగారి జీవితంలో అన్ని ట్విస్ట్ లు టర్న్ లు లేవు.. ప్లెయిన్ గా ఉంటుంది.. బయోపిక్ ఒక డాక్యుమెంటరీ లా ఉంటుంది' అని ఓపెన్ గానే చెప్పాడు. ఇక సెట్స్ పై ఉన్న సినిమాలలో కొన్నిటి పరిస్థితి దాదాపు అదే.

శ్రద్ధకపూర్ ప్రధాన పాత్ర లో బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాపై కూడా అలాంటి అనుమానాలే ఉన్నాయి.  ఒక బయోపిక్ కు సరిపడినంత డ్రామా సైనా జీవితంలో అసలు ఉందా అని కొందరు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సైనా బ్యాడ్మింటన్ లో అద్భుత విజయాలు సాధించినప్పటికీ పర్సనల్ లైఫ్ లో ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించేంత ట్విస్ట్ లు టర్న్ లు లేవు.  సైనా జీవితంలో ఒక్క వివాదం కూడా లేదు. అందుకే సైనా లవ్ స్టొరీ ని హైలైట్ చెయ్యాలని ఫిలిం మేకర్స్ చూస్తున్నారని టాక్.

హైదరాబాద్ బేస్డ్ బాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ తో సైనా ప్రేమలో ఉందన్నది చాలా ఓల్డ్ న్యూస్.  ఇద్దరూ పెళ్లి డిసెంబర్ లో పెళ్లిచేసుకోబోతున్నారు. నిజానికి ఇద్దరూ తమ ప్రేమ గురించి ఎప్పుడూ మీడియాతో మాట్లాడలేదు. ఇద్దరూ కలిసి బయటతిరిగిందీ లేదు. లవ్ విషయంలో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు.   పెళ్లి కూడా లో ప్రొఫైల్ లో చేసుకుందామని అనుకున్నారట. కానీ ఇప్పుడు బయోపిక్ కు బజ్ తీసుకురావడం కోసం పెళ్లి.. ప్రేమ వార్తలను హైలైట్ చేస్తున్నారట.  ఏమో నిజం అయి ఉండొచ్చు కూడా!


Tags:    

Similar News