ఇద్దరూ పోటీపడి గ్లామర్ ఆరబోస్తున్నారు

Update: 2016-07-10 04:36 GMT

సాక్షి చౌదరి.. కామ్నా రనావత్.. ఉన్నారు చూడండి.. వాళ్లెవ్వరూ అంటారా? అక్కడికే వస్తున్నాం. అప్పట్లో గ్లాడ్రాగ్స్ మోడల్ గా బికినీ షూట్లతో పిచ్చెత్తించిన బ్యూటి సాక్షి చౌదరి. ఈ అమ్మడు మంచు మనోజ్ ''పోటుగాడు'' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత రెండు మూడు సినిమాల్లో మెరసింది. హాట్నెస్ కు పెట్టింది పేరు. ఇక కామ్నారనావత్‌ అనే సుందరి.. ఎప్పటినుండో హీరోయిన్ అవుదామని వెయిట్‌ చేస్తున్న టీవి సీరియల్ నటి. హిందీలో చాలా సీరియల్స్ చేసింది. ఈ ఇద్దరికీ లింకేంటి అనేగా. అక్కడికే వస్తున్నాం.

''సెల్ఫీ రాజా'' అంటూ అల్లరి నరేష్‌ మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో సాక్షి అండ్ కామ్నా ఇద్దరూ హీరోయిన్స్. ఇప్పటికే రిలీజైన మూడు పాటల టీజర్లను చూస్తుంటే.. ఈ అమ్మళ్ళిద్దరూ ఎంతెంత హాటుగా అందాలు ఆరబోశారనే విషయం మనకు అర్ధమైపోతుంది. మై హూ సెల్ఫీ రాజా అనే పాటలో కామ్నా అందాలైతే ఊరించేస్తున్నాయి. వానలో తడుస్తూ ఆమె ఒంపుసొంపులను ఒక రేంజులో ఆరబోసింది. ఇక సాక్షి కూడా తక్కువ కాదులే. కొలతలు వేరే అంటూ తన కొలతలను చూపిస్తూ హొయలుపోయింది. అంతే కాదు.. మరో పాటలో ఇద్దరు హీరోయిన్లూ పోటిపడి మరీ ఆరబోశారు. ఈ అందాలన్నీ బి-సి సెంటర్లలో తనకు బాగా ప్లస్ అవుతాయని కోరుకుంటున్నాడు నరేష్‌. అది సంగతి.
Full View

Tags:    

Similar News