సలామ్ వెంకీ ట్రైలర్: ఆస్ప‌త్రిలో కొడుకు కోసం త‌ల్లి ఆవేద‌న‌

Update: 2022-11-15 04:12 GMT
90ల‌లో అగ్ర క‌థానాయిక‌లుగా వెలిగిన చాలా మంది వెట‌ర‌న్ స్టార్స్ ఇటీవ‌ల‌ తిరిగి వెండితెర‌పై స‌హాయ‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మ వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల‌ను ఎంచుకుని ఎంతో హుందాగా తెర‌పై క‌నిపిస్తున్నారు. భారీ పారితోషికాల‌ను తీసుకుంటున్నారు. మంచి క‌థ దొరికితే ద‌ర్శ‌కుడు స్క్రిప్టుతో మెప్పిస్తే నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల్లోను మెప్పించేందుకు వెన‌కాడ‌డం లేదు. ఇదే కోవ‌లో ఇటీవ‌లి కాలంలో ప‌లువురు మేటి నాయిక‌లు ప్ర‌యోగాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇదే బాటలో ఇప్పుడు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి కాజోల్ 'సలామ్ వెంకీ' అనే ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రంలో నటించారు.  రేవతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైల‌ర్ ఆద్యంతం త‌ల్లి - కొడుకు అనుబంధం నేప‌థ్యంలో ఎమోషనల్ గా సాగింది.

ఆస్ప‌త్రిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుమారుడికి తల్లిగా కాజోల్ న‌టించారు. జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌తో పోరాడే కుమారుడు ఎలాగైనా త‌న స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆశించే త‌ల్లిగా కాజోల్ ఎంతో ఎమోష‌న‌ల్ గా న‌టించారు. బ‌తుకు ఆశ న‌డుమ అనుబంధాన్ని తెర‌పై ఎంతో హృద్యంగా చూపించారు ద‌ర్శ‌కుడు. కొడుకు అనారోగ్య స‌మ‌స్య నుంచి గెలిచేవ‌ర‌కూ తుది కంటా పోరాడే త‌ల్లిగా కాజోల్ క‌నిపిస్తుంది.

స‌లామ్ వెంకీ టైటిల్ కి త‌గ్గ‌ట్టే వెంకటేష్ గా నటిస్తున్న విశాల్ జెత్వా ఎంతో అద్భుత పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుక‌న్నాడు. ప్రోమోలో అత‌డు ఎంతో ఎమోష‌న‌ల్ లుక్ తో మైమ‌రిపించాడు. ఈ ట్రైల‌ర్ వీక్షించాక మేటి క్లాసిక్ సినిమా 'మాతృదేవోభ‌వ‌' (నాజ‌ర్ మాధ‌వి ఫ్యామిలీ డ్రామా) త‌ర‌హా ఎమోష‌న‌ల్ స్టోరీ ఇద‌ని భ‌రోసానిస్తోంది.

ఇది రియ‌ల్ లైఫ్ స్టోరి ఆధారంగా రూపొందుతున్న చిత్ర‌మ‌ని చెబుతున్నారు. 'ది లాస్ట్ హుర్రా' అనే పుస్తకం ఆధారంగా తెర‌కెక్కించారని స‌మాచారం. ఇక ట్రైల‌ర్ ఆద్యంతం ఆస్ప‌త్రి చుట్టూ తిరుగుతూ ఎమోష‌న్ ని ర‌గిలిస్తుంది. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ట్రైల‌ర్ చివ‌రిలో ఛ‌మ‌క్కుమ‌ని మెరవ‌డం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతుంది.

క‌నెక్ట్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని బ్లైవ్ ప్రొడక్షన్స్ - ఆర్ టేక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో రూపొందిన ఈ ఎమోష‌నల్ రైడ్ 9 డిసెంబర్ 2022న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View


Tags:    

Similar News