ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ విడుదలకు సిద్దం అయ్యింది. మూడేళ్లుగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ సంక్రాంతి కానుకగా రాబోతున్న నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమా లో పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా పూర్తిగా ఒక ప్రేమ కథతో రూపొందించినట్లు చెబుతున్నారు. సినిమా లో కనీసం ఒక ఫైట్ కాని.. కామెడీ ట్రాక్ కానీ ఉండదని మేకర్స్ చెబుతున్నారు. అయినా కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో వారు ఉన్నారు. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నుండి వస్తుందని అంతా ఎదురు చూస్తున్న సినిమా 'సలార్'.
ప్రభాస్ తో సలార్ ను కేజీఎఫ్ ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. సలార్ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యి రెండు షెడ్యూల్స్ ను కూడా పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ఆలస్యం అయ్యింది కాని లేదంటే ఈ సంక్రాంతికి సలార్ తో ప్రభాస్ దిగాల్సి ఉంది. సలార్ లో కేజీఎఫ్ ను మించిన హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు. సింగరేణి లో చేసిన యాక్షన్ సన్నివేశాల గురించి సినీ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నాలజీని వాడుతున్నట్లుగా చెబుతున్నారు. ఆదిపురుష్.. ఆ తర్వాత ప్రాజెక్ట్ కే షూటింగ్ ల కారణంగా కొన్ని వారాలుగా సలార్ సెట్స్ పైకి ప్రభాస్ వెళ్లలేదు. మళ్లీ సలార్ తో జాయిన్ అయ్యేది ఎప్పుడు అనుకుంటూ ఉండగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
సలార్ సినిమా షూటింగ్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏర్పాట్లు చేస్తున్నాడని.. జనవరి మూడవ లేదా చివరి వారం నుండి సలార్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లుగా చెబుతున్నారు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. దేశ వ్యాప్తంగా సినిమా ను ప్రమోషన్ చేస్తున్నారు. అందుకోసం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.. ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సినిమా విడుదల అయిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని మళ్లీ సలార్ షూట్ లో ప్రభాస్ జాయిన్ అవుతాడనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సలార్ సినిమా ను ఖచ్చితంగా 2022 లోనే విడుదల చేయాలని పట్టుదలతో మేకర్స్ ఉన్నారట. కనుక సంక్రాంతి పూర్తి అయిన వెంటనే సలార్ షూట్ లో ప్రభాస్ జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.