సల్మాన్ ఖాన్ రాధే కోసం హైబ్రిడ్ విడుదలను ఎంచుకున్నారు. ఈద్ కానుకగా మే 13న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీఈలోనూ విడుదల చేయనున్నారు. నిజానికి ఊహకు అందని నిర్ణయమిది. రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ఈద్ కు థియేట్రికల్ రిలీజ్ కావాల్సి ఉన్నా..తాజా పరిణామాల దృష్ట్యా తన స్టూడియో భాగస్వామి జీతో కలిసి హైబ్రిడ్ రిలీజ్ మోడల్ ను ఎంచుకోవాలని సల్మాన్ నిర్ణయించుకున్నారు. ఈ చిత్రం థియేటర్లతో పాటు డిజిటల్ లోనూ ఒకే రోజున విడుదల కానుంది.
ఇది హాలీవుడ్ స్టూడియోస్ తరహా రిలీజ్ ఫార్మాట్. పెరుగుతున్న కోవిడ్ ఉధృతి దృష్ట్యా భాయ్ తీసుకున్న నిర్ణయమిది. ఇది బాలీవుడ్ నిర్మాతలతో పాటు ఇతరుల్లో చాలా మందిని ఆలోచింపజేసేదిగా ఉంటుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇదే వ్యూహాన్ని ఇతర హీరోలు నిర్మాతలు ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ .. జీ స్టూడియోస్ వర్గాలు ఇలాంటి నిస్తేజమైన దశలో పరిశ్రమలో కొంత సానుకూలతను తీసుకురావాలని కోరుకుంటున్నారు. ప్రేక్షకులు కచ్ఛితంగా రాధేను చూడాలనుకుంటున్నారు. అయితే అది ఎలాంటి రిస్కులు లేకుండా సౌకర్యంగా చూడాలన్నది వారి ఆలోచన. సినిమా హాళ్ళకు వెళ్లాలనుకునే వారు థియేటర్లలో చూడవచ్చు. దానిని ఇష్టపడని వారు చిన్న తెరపై ఈ చిత్రాన్ని సౌకర్యవంతంగా ఆస్వాధించవచ్చు. మే 13 న ఈద్ రిలీజ్ ఖాయమైంది.. అని సల్మాన్ బృందాలు వెల్లడించాయి.
అంతేకాదు.. డిజిటల్ విడుదల అంటే ఉచితంగా అందుబాటులో ఉండదు. మేకర్స్ పే-పర్-వ్యూ మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే ప్రేక్షకులు వారి ఇంటి వద్ద రాధేను చూడటానికి కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది OTT ప్లాట్ ఫామ్ లకు వారి సభ్యత్వంలో భాగం కాదు. ఇది జీప్లెక్స్ లో విడుదలవుతుంది`` అని పోస్టర్ వెల్లడించింది. ఇప్పటికే జీ స్టూడియో హైబ్రిడ్ విడుదలను ధృవీకరించింది.
ZEEPlex భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్ ఫాం ZEE5 పై అన్ని ప్రముఖ DTH ఆపరేటర్లపై ఆధారపడిన ఒక మాధ్యమం. అంటే డిష్- D2H- టాటా స్కై -ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీలోనూ వీక్షించే సౌలభ్యం ఉంటుంది.