'జో డర్ గయా..సమ్ ఝో బచ్ గయా'

Update: 2020-04-06 11:00 GMT
కరోనాను కట్టడి చేసేందుకు దేశమంతా 21 రోజుల లాక్ డౌన్ విధించడం తో అత్యవరసర సేవలు మినహా అన్ని రంగాలు స్తంభించిపోయాయి. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీబిజీగా ఉండే సినీతారలు కూడా లాక్ డౌన్ లో ఉంటూ...అభిమానులకు - ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్నిస్తున్నారు. ఇంటిపట్టునే ఉండాలంటూ...హ్యాండ్ వాష్ వంటివి తరచుగా చేయడంతో కరనా వ్యాప్తిని నివారించవచ్చంటూ సోషల్ మీడియాలో వీడియోలు - మెసేజ్ లు పెడుతున్నారు. తాజాగా కరోనాను తరిమికొట్టేందుకు అందరూ ఇళ్లలోనే ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. కరోనా మనల్నేమీ చేయదనే ధైర్యం వద్దని..కరోనా బారిన పడతామోమోనన్న భయం అందరిలోనూ ఉండాలని చెప్పాడు సల్లూ భాయ్. తాను దబంగ్ లో 'జో డర్ గయా... సమ్ ఝో మర్ గయా' అని చెప్పిన డైలాగ్ ఇప్పటి పరిస్థితులకు వర్తించదని...'జో డర్ గయా...సమ్ ఝో బచ్ గయా'అని చెప్పాడు సల్మాన్. కరోనాపై సల్మాన్ దబంగ్ డైలాగ్ - వీడియో... సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

లాక్ డౌన్ కు ముందు ముంబై శివార్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తర ఫామ్ హౌస్ లో ఉన్న సల్మాన్...లాక్ డౌన్ ప్రకటన తర్వాత అక్కడే ఉండిపోయాడు. సల్లూభాయ్ తో పాటు సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కుమారుడు నిర్వాన్ కూడా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన తాము...లాక్ డౌన్ వల్ల ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పాడు. తన తండ్రి సలీంని చూసి 3 వారాలైందన్న సల్మాన్...మూడు వారాల నుంచి నిర్వాన్ కూడా వాళ్ల నాన్నను చూడలేదని వీడియోలో చెప్పాడు. కరోనా ఏమీ చేయదన్న ధైర్యం ఇప్పుడు పనికిరాదని....కరోనాకు అందరూ భయపడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సల్లూ భాయ్ పిలుపునిచ్చాడు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం భయపడితే మనుగడ సాగిస్తామని చెప్పాడు. 'జో డర్ గయా సమ్ ఝో మర్ గయా' (భయపడే వాళ్లే మరణిస్తారు) అనే డైలాగ్ ను నిర్వాన్ కు గుర్తు చేసిన సల్మాన్....కరోనా వంటి విపత్క పరిస్థితులకు ఈ డైలాగ్ వర్తించదన్నాడు. కరోనాకు తాము భయపడ్డామని - ఆ విషయాన్ని తాను ధైర్యంగా అంగీకరిస్తానని అంటున్నాడు సల్లూ భాయ్. ఈ పరిస్థితుల్లో కరోనా ఏమీ చేయదులే అని ధైర్యంగా ఉండవద్దని...'జో డర్ గయా...సమ్ ఝో బచ్ గయా' అని పంచ్ డైలాగ్ వేశాడు సల్మాన్.
Tags:    

Similar News