ఫోటో స్టోరీ: మాజీ ల‌వ‌ర్స్..హ‌వ్వ హ‌వ్వ‌!!

Update: 2018-08-02 04:47 GMT
పిలిచినా రానంటావా..కలుసుకోలేనంటావా
       నలుగురూ ఉన్నారంటావా..చిలిపిగా చెంతకు రాలేవా
       తెలివిగా చేరేపోవా తెలియనే లేదా బావా
       అటు ఇటూ చూస్తూ ఉంటావా తటపటాయిస్తూ ఉంటావా
       సమయం కాదంటావా..సరదా లేదంటావా…
       సరసం చేదంటావా బావా
       చనువే తగదంటవా..మనవే విననంటావా
       వరసై ఇటు రమ్మంటే నా మాట మన్నించవా

ఇదిగో ఇక్క‌డ స‌న్నివేశం చూస్తుంటే `అత‌డు` పాట‌లానే - సిరివెన్నెల భావ‌జాలం లానే ఎంత హాయిగా .. ఇంకెంత రొమాంటిగ్గా ఉందో! న‌లుగురూ ఉన్న‌చోట క‌లుసుకోలేక‌పోయినా.. చిలిపిగా చెంత‌కు రాలేక‌పోయినా.. క‌లుసుకునే చోట క‌లుసుకుంటూనే ఉన్నారిలా. అటూ ఇటూ చూస్తూ త‌ట‌ప‌టాయించాల్సిన అవ‌స‌రం లేనంత స్టార్‌ డ‌మ్ వీళ్ల సొంతం కాబ‌ట్టి న‌చ్చిన‌ట్టు జీవించ‌డానికి అల‌వాటు ప‌డ్డారు. మాజీ ప్రేమికులైన స‌ల్మాన్ - క‌త్రిన ఇప్ప‌టికే క‌లిసిపోయారు. మ‌ళ్లీ కొత్త సావాసం స‌రికొత్త రూమ‌ర్లు పుట్టిస్తోంది. ఇక‌పోతే త‌న లైఫ్ ఘాటుమోటు ప్రియుడు ర‌ణ‌బీర్ క‌పూర్‌ తో దీపిక మ‌రోసారి ఇదిగో ఇలా స్నేహంగా క‌నిపించి పెద్ద షాకే ఇచ్చింది. ఓవైపు ర‌ణ‌వీర్ సింగ్‌ ని మ‌నువాడేందుకు సిద్ధ‌మ‌వుతూనే డిప్స్ ఇలా షాకిస్తోందేంటో?
Tags:    

Similar News