దాదాపు 32 ఏళ్ల ప్రేమ తర్వాత `టైగర్ 3` కోసం సల్మాన్ ఖాన్- రేవతి మళ్లీ తిరిగి రీయునైట్ అవుతున్నారు. ఈ జంట దాదాపు మూడు దశాబ్దాల తర్వాత స్క్రీన్ ను షేర్ చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ టైగర్ 3లో రేవతి పాత్ర గురించిన వివరాలు ప్రస్తుతానికి టాప్ సీక్రెట్. ఈ వెటరన్ నటి పాత్రలో బిగ్ సర్ ప్రైజ్ ఉంటుందని ట్విస్టును రివీల్ చేస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఒకసారి సల్మాన్ - రేవతి జంట గతంలోకి వెళితే.. లవ్ అనే 1991 క్లాసిక్ మూవీని తిరిగి గుర్తు చేసుకోవాలి.
సల్మాన్ ఖాన్ - రేవతిల 1991 రొమాంటిక్ చిత్రం `లవ్` విడుదలై 30 సంవత్సరాలు దాటింది. అయితే ఇది ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా `సాథియా తూనే క్యా కియా` పాటను ఎప్పటికీ మరువలేరు.
లవ్ చిత్రంతోనే రేవతి బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. సల్మాన్ లాంటి స్టార్ సరసన తనకు తొలి అవకాశం. ఈ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 1991 భారతీయ హిందీ-భాషా శృంగార చిత్రంగా వీకీలోను ఇది రికార్డులకెక్కింది. ఇది తెలుగు సినిమా ప్రేమ (1989)కి రీమేక్. ప్రేమలో వెంకటేష్ సరసన రేవతి నటించింది. అయితే బాలీవుడ్ వెర్షన్ కేవలం యావరేజ్ గా మాత్రమే మిగిలింది. ఒరిజినల్ మూవీ తరహాలో విజయాన్ని పునరావృతం చేయలేకపోయింది. కేవలం సగటు వసూళ్ల సినిమాగా నిలిచింది. నిజానికి హిందీ ఫిలిం మేకర్స్ ఒరిజినల్ లోని విషాదకరమైన క్లైమాక్స్ ను సుఖాంతం అయ్యేదిగా మార్చారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఈ సినిమా `సాథియా తూనే క్యా కియా` అనే రొమాంటిక్ సాంగ్ ఎటర్నల్ గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా హక్కులను షారూఖ్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సొంతం చేసుకుని రీమేక్ చేసింది. అప్పటికి సల్మాన్ ఖాన్ వరుసగా ఆరు హిట్లు కొట్టి 7వ సినిమాగా యావరేజ్ విజయాన్ని అందుకున్నాడు లవ్ తో.
ఇప్పుడు లవ్ కాంబినేషన్ తిరిగి రిపీటవుతోంది. సల్మాన్ - రేవతి జంట 32 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకటవడానికి సిద్ధంగా ఉన్నారు. యష్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మక యాక్షన్ సాగా టైగర్ 3లో ఈ ఇద్దరూ ఫేస్ టు ఫేస్ కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ హిమేష్ మన్కడ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. #ప్రేమ తర్వాత 32 సంవత్సరాలకు సల్మాన్ ఖాన్ - రేవతి టైగర్ 3 కోసం మళ్లీ కలిశారని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతానికి రేవతి పాత్ర వివరాలు గోప్యంగా ఉంచారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ టైగర్ 3... వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్ థా టైగర్ - టైగర్ జిందా హై తర్వాత టైగర్ సిరీస్ లో మూడవ చిత్రం కావడం సల్మాన్- కత్రినా కైఫ్ - రణవీర్ షోరే కాంబో పునరావృతం కావడం ఆసక్తిని పెంచుతోంది. ఇందులో రేవతితో పాటు ఇమ్రాన్ హష్మీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రను కూడా పోషించనున్నారు.
లవ్ తర్వాత సల్మాన్ - రేవతి స్క్రీన్ ని షేర్ చేసుకోకపోయినా 2004లో రేవతి దర్శకత్వం వహించిన `ఫిర్ మిలేంగే`లో సల్మాన్ నటించారు. అభిషేక్ బచ్చన్- శిల్పాశెట్టి కూడా నటించిన ఈ చిత్రం ఎయిడ్స్ అవగాహన గురించి స్పెషల్ కథనంతో తెరకెక్కింది. నటిగా రేవతి చివరిగా గత నెలలో విడుదలైన ఎమోషనల్ డ్రామా మూవీ `ఏ జిందగీ`లో కనిపించింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే `ప్రేమ` చిత్రం 90లలో తెరకెక్కింది. అప్పటి సామాజిక వ్యవస్థలో యువతీయువకుల మధ్య ప్రేమ రొమాన్స్ ఎంతో సహజంగా ఉండేది. యువతీ యువకుల సెన్సిబిలిటీస్ వేరుగా ఉండేవి. సెంటిమెంట్లకు ఆస్కారం ఉండేది. కలతలకు తావుండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఇదంతా స్పీడ్ యుగం. ప్రేమ పేరుతో ఆకృత్యాలు పెరిగాయి. లవ్ సినిమాలో సల్మాన్ లా.. ప్రేమ సినిమాలో వెంకటేష్ లా నిజాయితీ పరులైన ప్రేమికులు బయట కనిపించడం లేదు. కేవలం మగ పుంగవుల వైపు నుంచే కాకుండా మహిళల వైపు నుంచి కూడా క్రైమ్ మర్డర్ కహానీలు.. రియల్ క్రైమ్ ప్రేమకథలు పుట్టుకొస్తుంటే పోలీసులే అవాక్కవుతున్నారు.
ఈరోజుల్లో `లవ్` మూవీ జంట సల్మాన్ - రేవతిలా ప్రేమించుకుందామంటే కుదరట్లేదు. మహిళా సంఘాలు వచ్చి అల్లరి పెడుతున్నాయి. దిశా పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తున్నారు. యువతీయువకుల మధ్య సహజమైన ప్రేమ రొమాన్స్ అనే టింజ్ ఇటీవల సాంతం కోల్పోయారని ఒక సెక్షన్ యూత్ నుంచి కొంత ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే క్లాసిక్ లవ్ స్టోరిలు ఇక తీయడం ఫిలింమేకర్స్ కి సవాల్ లా మారింది!! ఈ రోజుల్లో దిశా పోలీసులు కూడా ప్రేమకథల్లో ఒక భాగం!!Full View
సల్మాన్ ఖాన్ - రేవతిల 1991 రొమాంటిక్ చిత్రం `లవ్` విడుదలై 30 సంవత్సరాలు దాటింది. అయితే ఇది ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్లాసిక్ గా నిలిచింది. ముఖ్యంగా `సాథియా తూనే క్యా కియా` పాటను ఎప్పటికీ మరువలేరు.
లవ్ చిత్రంతోనే రేవతి బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. సల్మాన్ లాంటి స్టార్ సరసన తనకు తొలి అవకాశం. ఈ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు. 1991 భారతీయ హిందీ-భాషా శృంగార చిత్రంగా వీకీలోను ఇది రికార్డులకెక్కింది. ఇది తెలుగు సినిమా ప్రేమ (1989)కి రీమేక్. ప్రేమలో వెంకటేష్ సరసన రేవతి నటించింది. అయితే బాలీవుడ్ వెర్షన్ కేవలం యావరేజ్ గా మాత్రమే మిగిలింది. ఒరిజినల్ మూవీ తరహాలో విజయాన్ని పునరావృతం చేయలేకపోయింది. కేవలం సగటు వసూళ్ల సినిమాగా నిలిచింది. నిజానికి హిందీ ఫిలిం మేకర్స్ ఒరిజినల్ లోని విషాదకరమైన క్లైమాక్స్ ను సుఖాంతం అయ్యేదిగా మార్చారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఈ సినిమా `సాథియా తూనే క్యా కియా` అనే రొమాంటిక్ సాంగ్ ఎటర్నల్ గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా హక్కులను షారూఖ్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సొంతం చేసుకుని రీమేక్ చేసింది. అప్పటికి సల్మాన్ ఖాన్ వరుసగా ఆరు హిట్లు కొట్టి 7వ సినిమాగా యావరేజ్ విజయాన్ని అందుకున్నాడు లవ్ తో.
ఇప్పుడు లవ్ కాంబినేషన్ తిరిగి రిపీటవుతోంది. సల్మాన్ - రేవతి జంట 32 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకటవడానికి సిద్ధంగా ఉన్నారు. యష్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మక యాక్షన్ సాగా టైగర్ 3లో ఈ ఇద్దరూ ఫేస్ టు ఫేస్ కలిసి నటిస్తున్నారు. ఈ విషయాన్ని జర్నలిస్ట్ హిమేష్ మన్కడ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. #ప్రేమ తర్వాత 32 సంవత్సరాలకు సల్మాన్ ఖాన్ - రేవతి టైగర్ 3 కోసం మళ్లీ కలిశారని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతానికి రేవతి పాత్ర వివరాలు గోప్యంగా ఉంచారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ టైగర్ 3... వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్ థా టైగర్ - టైగర్ జిందా హై తర్వాత టైగర్ సిరీస్ లో మూడవ చిత్రం కావడం సల్మాన్- కత్రినా కైఫ్ - రణవీర్ షోరే కాంబో పునరావృతం కావడం ఆసక్తిని పెంచుతోంది. ఇందులో రేవతితో పాటు ఇమ్రాన్ హష్మీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక అతిధి పాత్రను కూడా పోషించనున్నారు.
లవ్ తర్వాత సల్మాన్ - రేవతి స్క్రీన్ ని షేర్ చేసుకోకపోయినా 2004లో రేవతి దర్శకత్వం వహించిన `ఫిర్ మిలేంగే`లో సల్మాన్ నటించారు. అభిషేక్ బచ్చన్- శిల్పాశెట్టి కూడా నటించిన ఈ చిత్రం ఎయిడ్స్ అవగాహన గురించి స్పెషల్ కథనంతో తెరకెక్కింది. నటిగా రేవతి చివరిగా గత నెలలో విడుదలైన ఎమోషనల్ డ్రామా మూవీ `ఏ జిందగీ`లో కనిపించింది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే `ప్రేమ` చిత్రం 90లలో తెరకెక్కింది. అప్పటి సామాజిక వ్యవస్థలో యువతీయువకుల మధ్య ప్రేమ రొమాన్స్ ఎంతో సహజంగా ఉండేది. యువతీ యువకుల సెన్సిబిలిటీస్ వేరుగా ఉండేవి. సెంటిమెంట్లకు ఆస్కారం ఉండేది. కలతలకు తావుండేది కాదు. కానీ ఇప్పుడలా కాదు. ఇదంతా స్పీడ్ యుగం. ప్రేమ పేరుతో ఆకృత్యాలు పెరిగాయి. లవ్ సినిమాలో సల్మాన్ లా.. ప్రేమ సినిమాలో వెంకటేష్ లా నిజాయితీ పరులైన ప్రేమికులు బయట కనిపించడం లేదు. కేవలం మగ పుంగవుల వైపు నుంచే కాకుండా మహిళల వైపు నుంచి కూడా క్రైమ్ మర్డర్ కహానీలు.. రియల్ క్రైమ్ ప్రేమకథలు పుట్టుకొస్తుంటే పోలీసులే అవాక్కవుతున్నారు.
ఈరోజుల్లో `లవ్` మూవీ జంట సల్మాన్ - రేవతిలా ప్రేమించుకుందామంటే కుదరట్లేదు. మహిళా సంఘాలు వచ్చి అల్లరి పెడుతున్నాయి. దిశా పోలీసులు వచ్చి అరెస్టులు చేస్తున్నారు. యువతీయువకుల మధ్య సహజమైన ప్రేమ రొమాన్స్ అనే టింజ్ ఇటీవల సాంతం కోల్పోయారని ఒక సెక్షన్ యూత్ నుంచి కొంత ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే క్లాసిక్ లవ్ స్టోరిలు ఇక తీయడం ఫిలింమేకర్స్ కి సవాల్ లా మారింది!! ఈ రోజుల్లో దిశా పోలీసులు కూడా ప్రేమకథల్లో ఒక భాగం!!