అబ్బా.. అథ్లెట్లకు అంతిచ్చేస్తాడా?

Update: 2016-08-18 09:30 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఇప్పుడు జరుగుతున్న రియో ఒలింపిక్స్ కు గుడ్ విల్ అంబాసిడర్ అనే సంగతి తెలిసిందే. అసలు సల్లూభాయ్ ని ఎంపిక చేయడంపైనే వివాదం ఉన్నా.. దీనిపై నోరు మెదపకుండా తన పని తాను చేసుకుపోయాడు. ఇప్పుడు ఒలింపిక్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఆగస్ట్ 21న రియో ఒలింపిక్స్ కు ఆఖరి రోజు.

ఈ సమయంలో సల్మాన్ ఖాన్ ఓ పెద్ద అనౌన్స్ మెంట్ చేశాడు. ఒలింపిక్ గోల్డ్ వేటలో భాగం అయిన అథ్లెట్స్ కు తాను సపోర్ట్ గా నిలవాలని భావించిన సల్మాన్.. అందరికీ తన వంతుగా కొంత మొత్తాన్ని అందించనున్నట్లు చెప్పాడు. ఒక్కో అథ్లెట్ కు రూ.1,01,000 చొప్పున ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశాడు సల్లూ భాయ్. అయితే.. సల్మాన్ ప్రకటనపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఒలింపిక్స్ లాంటి బిగ్గెస్ట్ స్పోర్ట్స్ ఈవెంట్ ను చేరుకోవడం అంటే.. ఎన్నెన్నో కాస్ట్లీ కష్టాలనే పడాల్సి వస్తుందనే సంగతి అందరికీ తెలిసిందే. అసలు వీరికి స్పాన్సరర్లు లేకపోతే ఈ స్టేజ్ వరకూ వెళ్లడం కూడా కష్టమే.

మెడల్ గెలవడం కంటే.. ఒలింపిక్స్ లో ప్రాతినిథ్యం వహించడమే పెద్ద అఛీవ్మెంట్. దాన్ని అందుకున్న వాళ్లకు లక్ష రూపాయలు చిన్న మొత్తం అన్నది చాలామంది వాదన. అయితే.. ఒక్కొక్కళ్లకి ఇంత మొత్తం అంటే.. మొత్తం ఒలింపిక్ అథ్లెట్స్ టీం 118మందికి అంతటికీ కలిపి ఒక కోటీ ఒక లక్షా 18వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పెద్ద మొత్తమే కదా.

Tags:    

Similar News