తాజాగా కృష్ణజింకల కేసునుండి ఊరట పొందిన సల్మాన్ కు సంబందించిన మరో గుడ్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు కొత్త వ్యాపారంలోకి దిగబోతున్నారట. అది సినిమా నిర్మాణమో - లేక మరే సినిమాలకు సంబందించిన వ్యాపారమో కాదు.. జ్యూయెల్లరీ వ్యాపారం. అవును సల్మాన్ ఖాన్ జ్యుయెల్లరీ బిజెనెస్ ను ప్రారంభించనున్నారు. ఈ విషయాలను ఆయన సోదరి అర్పిత ఖాన్ స్వయంగా వెల్లడించారు.
తాజాగా జరిగిన "రీటైల్ జ్యుయెల్లరీ ఇండియా - 2016" అవార్డుల కార్యక్రమానికి హాజరైన అర్పిత ఖాన్ ఈ మేరకు సల్మాన్ బిజినెస్ విషయాలను తెలియజేశారు. ది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ద్వారానే సల్మాన్ ఈ కొత్త వ్యాపారంలోకి అడుగు పెడుతున్నాడట. ఈ సందర్భంగా మాట్లాడిన అర్పిత... తమకెంతో ఇష్టమైన జ్యుయెల్లరీ బిజెనెస్ ను త్వరలోనే లాంచ్ చేస్తామని - ఈ బీయింగ్ హ్యూమన్ ఉత్పత్తులు సరసమైన ధరలకు అన్ని రకలా వినియోగదారులకూ అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా 70 శాతం మహిళల కోసం 30శాతం పురుషులకు ఉపయోగపడేలా తమ కలెక్షన్ ఉండబోతున్నాయని చెప్పిన అర్పిత ఈ వ్యాపారం తనకు, తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని తెలిపారు. కాగా బీయింగ్ హ్యూమన్ అని రాసి ఉన్న టీషర్ట్ లతో సల్మాన్ ఖాన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నాడు.