భాయిజాన్ సల్మాన్ ఖాన్.. ఇల్లు కట్టి ఇస్తానని, పీకి పందిరేశాడు... అంటూ వాపోతోంది ఓ మహిళ. ఏనాటికైనా సల్మాన్ వస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు. ఇల్లు కట్టి ఇస్తాడు.. అంటూ ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. అయితే ఆవిడ కల నెరవేరుతుందా? సల్మాన్ వస్తాడా? ఆ కుటుంబాన్ని పట్టించుకుంటాడా? ఇదీ బాలీవుడ్ లో సాగుతున్న ఆసక్తికర డిబేట్. ఇంకాస్త డీటెయిల్స్ లోకి వెళితే...
సల్మాన్ ఖాన్ 'భజరంగి భాయిజాన్' షూటింగ్ టైమ్ లో కాశ్మీర్ లోని ఓ కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నానని, ఆ కుటుంబానికి నెలలోపే ముంబై లో ఓ ఇల్లు కట్టిస్తానని బహిరంగంగా ప్రకటించాడు. అంతేకాదు కాశ్మీర్ లో ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని తన సినిమా షూటింగు కోసం ఉపయోగించుకున్నాడు. ఆ ఫ్యామిలీలో ఓ చిన్నారికి భజరంగి భాయిజాన్ లో నటించే ఛాన్సిచ్చాడు. కట్ చేస్తే సినిమా షూటింగ్ అయిపోయింది. రిలీజై 600కోట్ల వసూళ్లు సాధించింది. కానీ భాయిజాన్ మాత్రం మిస్సింగ్. ఫోన్ కి దొరకడు. పలకరించాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. భాయిజాన్ ఇంత పనిచేస్తావా? అంటూ వాపోయింది ఆ కుటుంబం. సల్మాన్ మోసం చేయడు, వస్తాడనే నమ్ముతున్నాం అంటూ చెప్పింది సదరు మహిళ.
కాశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లాలోని దియారూ ప్రాంతానికి చెందిన జైనా (75)బేగమ్ వ్యథ ఇది. కూతురు దిల్షాదా (40) సహా నలుగురు చిన్నారులతో ఆ ఇంట్లో నివాసం ఉంటోంది. ఉపాధి లేక తిండిలేక ఇబ్బంది పడుతున్నాం. సల్మాన్ రెండు గదుల ఇల్లు ఇచ్చినా ముంబైలో బతికేస్తాం అని చెబుతోంది దిల్షానా. అయితే సల్మాన్ తరపు నుంచి ఇల్లు నిర్మాణంలో ఉంది. టైమ్ పడుతుందనే సమాధానం వచ్చిందని సదరు జైనా చెబుతోంది. ఈ ఎపిసోడ్ ఎంతవరకూ వెళుతోందో వేచి చూద్దాం.