అమీ జాక్సన్ ని తిట్టేశాడట!!

Update: 2016-08-08 15:30 GMT
స్పోర్ట్స్ పై సినిమాలకు మంచి డిమాండ్ ఉండడంతో.. ఇప్పుడు అదే జోనర్ లో కొత్త సినిమా వస్తోంది. సల్మాన్ ఖాన్ సమర్పణలో.. నవాజుద్దీన్ సిద్దికీ - అర్బాజ్ ఖాన్.. అమీ జాక్సన్ లు నటించిన 'ఫ్రీకీ ఆలీ' సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది.

ఫ్రీకీ ఆలీ రిలీజ్ కు మరో నెల రోజులు మాత్రమే ఉండడంతో.. ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. రీసెంట్ గా సల్మాన్ కూడా ఈ మూవీ పబ్లిసిటీలో భాగం అయ్యాడు. ట్వీట్స్ పెడుతూ తమ్ముళ్లకు సాయం చేస్తున్నాడు. ఫ్రీకీ ఆలీ మూవీలో సల్మాన్ కి ఓ తమ్ముడు అర్బాజ్ ఖాన్ నటించగా.. మరో సోదరుడు సోహైల్ ఖాన్ డైరెక్టర్. అయితే.. ఈ మూవీతో హిట్ కొట్టేందుకు ఈ ఖాన్ బ్రదర్స్.. అమీని ఫుల్లుగా వాడేస్తున్నారు. అమీ కూడా తనవంతుగా హిట్ కోసం బాగా ట్రై చేస్తూ.. ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి ఇదుగో ఇలా క్లీవేజ్ షోతో చంపేసింది.

అమ్మడి అందాల ఆరబోత అభిమానులకు బాగానే కనువిందు చేసింది కానీ.. ఇలాంటి ఫీట్స్ విషయంలో సల్మాన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. తన సినిమాల్లో కూడా గ్లామర్ డోస్ చాలా లిమిటెడ్ గా ఉండేలా చూసే సల్లూ భాయ్.. మరీ ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడాన్ని అసలు సహించలేకపోయాడట. పబ్లిక్ ఫంక్షన్ కావడంతో అప్పటికి ఊరుకున్నా.. ఈవెంట్ అయిన వెంటనే చెడామడా తిట్టేశాడని టాక్.

Tags:    

Similar News