సల్మాన్ ఖాన్ వివాదాలకు కొత్తేం కాదు. మాట జారడం - చెయ్యి జారడం - కాలు జారడం.. ఇలా రకరకాల వివాదాల మధ్యలోనే ఉంటాడు. ఇప్పుడు తన సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో.. నోరు జారిన సల్మాన్ మరో వివాదానికి తెర తీశాడు. అయితే తప్పు అని వెంటనే గ్రహించి నా ఉద్దేశ్యం అది కాదని చెప్పే ప్రయత్నం చేయడమే అంతో ఇంతో బెటర్.
'ఆ సీన్ కోసం 6 గంటల షూటింగ్ సమయం నరకంలా అనిపిచింది. 120కిలోల వ్యక్తిని అమాంతం పైకెత్తి మళ్లీ కిందకు పడేయాలి. ఇది చాలా సార్లు.. చాలా యాంగిల్స్ లో చేయాల్సి ఉంటుంది. నిజమైన రెజ్లర్ కూడా ఒకే రోజు అన్ని సార్లు అవతలి వ్యక్తిని ఎత్తాల్సిన అవసరం ఉండదు. అంతా అయ్యే సరికి నా పరిస్థితి రేప్ అయిపోయిన మహిళలా అయిపోయింది. కనీసం తిన్నగా నడవలేకపోయాను' అంటూ చెప్పుకొచ్చాడు సల్లూ భాయ్.
తను ఎంత కష్టపడ్డాడో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ సల్మాన్ కి దొరకలేదా అన్నదే అసలు ప్రశ్న. అయితే.. ఆ వెంటనే తడుముుకుని.. నా ఉద్దేశ్యం ఏంటంటే అంటూ తామెంత కష్టపడ్డామో చెబుతున్నా అన్నాడు సల్మాన్.