కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా సినిమాల విడుదల ఆగిపోయాయి. కొన్ని చిన్న సినిమాలను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు కాని స్టార్ హీరోల సినిమాలు మాత్రం థియేటర్ రిలీజ్ కు వెయిట్ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా థియేటర్లు నడుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అయినా కూడా సల్మాన్ ఖాన్ రాధే సినిమాను రంజాన్ సందర్బంగా విడుదల చేసి అందరిని ఆశ్చర్యపర్చాడు. పే పర్ వ్యూ ద్వారా ఓటీటీ మరియు థియేటర్ల ద్వారా విడుదల చేసిన రాధే సినిమా కు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజే భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీ గా వసూళ్లు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
రాధే సినిమా ఓవర్సీస్ లో మొదటి రోజు 6.75 లక్షల డాలర్లను వసూళ్లు చేయగా రెండవ రోజు 6 లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. గురు శుక్రవారాల్లోనే ఏకంగా 1.27 మిలియన్ డాలర్లను రాధే సినిమా రాబట్టింది. ఇక శని ఆదివారాల్లో మరింతగా రాబట్టే అవకాశం ఉందంటున్నారు. ఈద్ మరియు లాంగ్ వీకెండ్ కారణంగా రాధే సినిమా ఓవర్సీస్ లో భారీ గా రాబడుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. రాధే రాబట్టిన ఓవర్సీస్ కలెక్షన్స్ లో మెజార్టీ భాగం గల్ఫ్ దేశాల నుండి వచ్చినట్లుగా తెలుస్తోంది.
గల్ఫ్ లో సల్మాన్ ఖాన్ అభిమానులు భారీగా ఉన్నారు. ఈద్ సందర్బంగా వారు రాధే సినిమా ను తెగ చూచినట్లుగా వసూళ్లను బట్టి అర్థం అవుతోంది. బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం గల్ఫ్ లో మొదటి రోజు 4.75 లక్షల డాలర్లు వసూళ్లు అవ్వగా రెండవ రోజు 4 లక్షల డార్లు వసూళ్లు అయ్యాయి. శని ఆదివారాల్లో మరో అయిదు ఆరు లక్షల డార్లు వసూళ్లు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. లాంగ్ రన్ లో రాధే కేవలం గల్ఫ్ లోనే రెండు మిలియన్ ల డాలర్లను వసూళ్లు చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. కరోనా ఈ రీతిన ఉన్న సమయంలో రాధే సినిమాకు ఇంత భారీ వసూళ్లు నమోదు అవుతాయని ఎవరు ఊహించలేదు. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల కూడా వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది.