బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నగా పోలీసులు ఛేదించారు. సల్మాన్ ను చంపడానికి ఓ వ్యక్తి రెక్కీ నిర్వహించాడని తెలియడంతో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో సుశాంత్ రాజ్ పుత్ చనిపోయిన విషయం తెలిసిందే. అతడి మృతిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ ఆరోపణలు రావడంతో కేసు సీబీఐకి అప్పగించారు. ఇదిలా కొనసాగుతుండగానే మరో స్టార్ హీరో పై హత్యకు కుట్ర జరగడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి హర్యానా, పంజాబ్, రాజస్థాన్ కు చెందిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. షార్ప్ షూటర్ రాహుల్ ను ఉత్తరాఖండ్లో ఫరీదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. సల్మాన్ ఖాన్ ను చంపే బాధ్యతను లారెన్స్ బిష్ణోయ్ రాహుల్ కు అప్పగించాడు.
దీంతో రాహుల్ గత జనవరిలో ముంబై వచ్చి సల్మాన్ ఖాన్ నివాసముండే బాంద్రాలో మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. ఇదిలా ఉండగా ఫరీదాబాద్లో ప్రవీణ్ అనే యువకుడిని రాహుల్ హత్య చేయగా.. ఆ కేసుకు సంబంధించి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రాహుల్ ను విచారించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను చంపేందుకు రెక్కీ నిర్వహించినట్లు రాహుల్ అంగీకరించాడు. జోధ్ పూర్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనకు సుపారీ ఇచ్చి రెక్కీ నిర్వహించేందుకు ముంబయి పంపినట్లు ఒప్పుకున్నాడు.
గతంలో సల్మాన్ ఖాన్ రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు రావడంతో ఇప్పటికీ కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో భాగంగా సల్మాన్ కొద్ది రోజులు జైలు జీవితం కూడా గడిపారు. కాగా రాజస్థాన్ లోని బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను ఆరాధిస్తుంది. సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడిన ప్పటినుంచి. ఆయనపై ఈ జాతికి చెందిన కొందరు కోపం పెంచుకున్నారు. సల్మాన్ ఖాన్ పై శత్రుత్వం పెంచుకున్న లారెన్స్ బిష్ణోయ్ 2018 లోనే ఆయన హత్యకు కుట్ర పన్నాడు. తన కుడి భుజమైన సంపత్ నెహ్రాతో ముంబైలో రెక్కీ నిర్వహించినా హత్యకు సాధ్యం కాలేదు. ఇప్పుడు మరోసారి లారెన్స్ బిష్ణోయ్ రాహుల్ కు సుపారీ ఇచ్చి సల్మాన్ ఖాన్ ను చంపడానికి మరోసారి ప్రయత్నించాడు. సల్మాన్ పై హత్యాయత్నం జరిగినట్లు తెలియడంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది.