ఇటీవలి కాలంలో సీన్ అంతా రివర్సులో వెళుతోంది. బాలీవుడ్ వాళ్లు ఏం తీసినా ఉత్తరాది జనం పెద్దగా చూడటం లేదు. అడపా దడపా మాత్రమే సినిమాలు ఘనవిజయాలు సాధిస్తున్నాయి. స్ట్రెయిట్ హిందీ సినిమాలను డామినేట్ చేస్తూ సౌత్ సినిమాలు వెల్లువెత్తుతుంటే .. భారీ వసూళ్లను సాధిస్తుంటే ఓర్వలేని తనం హిందీ హీరోల్లో కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. సౌత్ సినిమాని నార్త్ లో చూస్తున్నా.. నార్త్ సినిమాల్ని సౌత్ లో చూడకపోవడంపై హిందీ హీరోల్లో పెద్ద చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఇటీవలి కాలంలో షారూక్ ఖాన్- సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్ సైతం ఓ మెట్టు దిగి వచ్చి సౌత్ కథల్ని దర్శకుల్ని ఎంపిక చేసుకుంటున్నారు.
ఇప్పుడు సల్మాన్ ఇంకో మెట్టు దిగి వచ్చి ఏకంగా విక్టరీ వెంకటేష్ తో కలిసి ఓ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేస్తుండడం చర్చనీయాంశమైంది. నిజానికి ఈ చిత్రాన్ని సల్మాన్ స్నేహితుడు సాజిద్ నడియాద్ వాలా నిర్మించాల్సి ఉన్నా కుదరలేదు. ఈ మూవీలో వెంకీ పాత్ర పూర్తి నిడివితో ఉంటుందా? అన్నదానిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఇందులో సల్మాన్ బావ గారైన ఆయుష్ శర్మ కూడా నటిస్తున్నారు.