సినిమా కోసం.. స్క్రిప్ట్ డిమాండ్ కోసం.. తన వ్యక్తిగత ఉద్దేశాలను ఏ మాత్రం పక్కన పెట్టే వ్యక్తి కాదు సల్మాన్ ఖాన్. ఈ స్టార్ హీరో మనసు మార్చి.. కొన్ని రకాల సీన్స్ లో నటింపచేసేందుకు చాలామందే ప్రయత్నించారు కానీ.. ఎవరి వల్లా కాలేదు. ఇప్పుడు టైగర్ జిందా హై అంటూ కొత్త మూవీతో వచ్చేస్తున్నాడు సల్లూ భాయ్.
ఈ సినిమాలో ఓ కీలక సన్నివేశం కోసం.. హీరోయిన్ ను ముద్దాడే సన్నివేశం ఉంటుందట. స్క్రిప్ట్ ప్రకారం ఇది అత్యంత ప్రధానమైన సన్నివేశం అని.. కత్రినా కైఫ్ తో లిప్ కిస్ చేయాలని సల్మాన్ ను అడిగాడట దర్శకుడు. సహజంగా ఇలాంటివాటికి సల్మాన్ ఒప్పుకోడనే సంగతి తెలిసే దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అడిగాడు. ఇక్కడ హీరోయిన్ గా నటిస్తున్నది సల్మాన్ మాజీ లవర్ అయిన కత్రినా కావడంతో.. తన ప్రిన్సిపల్ ను పక్కన పెట్టే అవకాశాలున్నాయని అంతా అంచనా వేశారు. అయితే.. సల్మాన్ ఖాన్ మాత్రం లిప్ లాక్ కు ససేమిరా అనేశాడట. దీంతో సినిమా నుంచి ఈ సీన్ ను డ్రాప్ చేసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.
హీరోయిన్స్ తో సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లలో నటించననే రూల్ ని మొదటి నుంచి పాటిస్తున్న సల్మాన్.. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేశాడు. ఇధి మాత్రమే కాదు.. నెగిటివ్ కేరక్టర్లు.. విలన్ తరహా రోల్స్ లో కనిపించకూడదని ముందే డిసైడ్ అయిపోయిన సల్మాన్.. అదే సిద్ధాంతాన్ని కంటిన్యూ చేస్తున్నాడు కూడా.