కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం భరత్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అబ్బాస్ అలీ జాఫర్ దర్శకత్వంలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా దిశా పటాని చెల్లెలుగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఈద్ పండుగను టార్గెట్ చేసుకుని రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్-జాఫర్ కాంబోలో వచ్చిన టైగర్ జిందా హై కమర్షియల్ గా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే దీని మీద కూడా ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
నిజానికి ఆ సినిమా క్లైమాక్స్ లో పాకిస్థాన్ జెండాలు చూపడం పట్ల ఆ టైంలోనే అభ్యంతరం వ్యక్తమయింది. కథ ప్రకారం ఓ ట్రక్కు మీద రెండు దేశాల పతకాలు ఎగరేసి బోర్డర్ దగ్గరకు తీసుకువస్తారు. ఎమోషన్ ని బాగా ఎలివేట్ చేయడం వల్ల అదంత వివాదం కాలేకపోయింది. కానీ ఇప్పుడు భరత్ లో కూడా అలాంటి సన్నివేశమే మరొకటి ఉందని ఇది మాత్రం ఖచ్చితంగా కాంట్రావర్సీ అవుతుందని బాలీవుడ్ మీడియా టాక్.
దాని ప్రకారం సల్మాన్ ఖాన్ ఇందులో పాకిస్థాన్ జెండా ఎగురవేసే సీన్ ఒకటి ఉందట. ఎంత స్టోరీ ప్రకారమే అయినా ఇలా శత్రు దేశం జెండాను ఇక్కడి హీరో ఎగరేసినట్టు ఎలా చూపుతారు అని మండిపడుతున్నారు నెటిజెన్లు. ఇది అధికారికంగా యూనిట్ చెప్పింది కాకపోయినా షూటింగ్ స్పాట్ నుంచి సభ్యులు చెప్పిన ప్రకారం లీక్ అయిన న్యూస్. సెన్సార్ నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం లేకపోలేదని మరికొందరు అంటున్నారు. రెండు దేశాల వైరుధ్యాలను నేపధ్యంగా తీసుకుని ఇప్పటికే లెక్కలేనన్ని సినిమాలు బాలీవుడ్ లో వచ్చాయి. కానీ ఎందులోనూ పాక్ జెండాను హై లైట్ చేయడం ఉండదు. మరి సల్మాన్ నిజంగానే అంతటి సాహసానికి పూనుకుని ఉంటే కాంట్రావర్సీ తప్పదు