బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ త్వరలో 'భారత్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మొదట హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే ఆమె పెళ్లి మరియు ఇతరత్ర కారణాలు చెప్పి సినిమా నుండి తప్పుకుంది. ఆమె చెప్పిన కారణాలు సల్మాన్ ఖాన్ కు సంతృప్తి ఇవ్వలేదో లేక మరేంటో కాని ప్రియాంక చోప్రాను సమయం చిక్కినప్పుడల్లా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితం ప్రియాంక చోప్రా మొదలు పెట్టిన డేటింగ్ యాప్ గురించి స్పందిస్తూ పెళ్లి అయిన ఆవిడకు ఇప్పుడు దాని అవసరం ఏంటీ అంటూ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా మరోసారి ప్రియాంక చోప్రాకు కౌంటర్ ఇచ్చాడు. ఒకసారి తనను కాదన్న వారిపై ఎప్పటి కోపంగా ఉండే వ్యక్తిత్వం సల్మాన్ ది అంటూ అంతా అంటూ ఉంటారు. తాజాగా ఆయన ప్రియాంక చోప్రా విషయంలో వ్యవహరిస్తున్న తీరును బట్టి చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది.
తాజాగా భారత్ చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆడియన్స్ తో లైవ్ చిట్ చాట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఒక అభిమాని ప్రియాంక చోప్రా సినిమా నుండి తప్పుకోవడం గురించి అడుగగా సల్మాన్ ఖాన్ స్పందిస్తూ 'ప్రియాంక చోప్రా మాకు ఎక్కువ సమయం ఇవ్వలేక పోయింది, దాంతో మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది' అన్నాడు. ఈ చిత్రం కోసం కత్రీనా చాలా కష్టపడిందని, పాత్రలో వేరియేషన్స్ అద్బుతంగా కనబర్చేలా కత్రీనా నటించిందని సల్మాన్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో సల్మాన్ డబుల్ రోల్ లో కనిపించబోతుండగా, కత్రీనా కైఫ్ మాత్రం 1975 నుండి 1990 వరకు యువతిగా, మద్య వయస్కురాలిగా ఆ తర్వాత 2010 వృద్దురాలి పాత్రలో కనిపించబోతుంది. ఈ చిత్రం జూన్ 5, 2019న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.