ఖాన్ త్రయంలో ఎవరు బిగ్గెస్ట్ స్టార్ అనే చర్చ చాలా ఏళ్ల నుంచి ఉంది. ఒకప్పుడైతే షారుఖ్ ఖాన్ ను నెంబర్ వన్ అనే వాళ్లు. తర్వాతి కాలంలో అమీర్ ఖాన్ అతణ్ని దాటేశాడు. అమీర్ సినిమా వచ్చినపుడల్లా రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. ఐతే ఖాన్ త్రయంలో మూడో వాడైన సల్మాన్ ఖాన్ నెంబర్ వన్ అనడానికి సందేహించే వాళ్లు. కానీ గత ఏడాది కాలంలో సల్మాన్ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ చూస్తుంటే.. అతను షారుఖ్.. అమీర్ లను దాటేయబోతున్నట్లే కనిపిస్తున్నాడు. గత ఏడాది ‘భజరంగి భాయిజాన్’తో రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ‘పీకే’కు చేరువగా వచ్చిన సల్మాన్.. ప్రస్తుతం ‘సుల్తాన్’తో అమీర్ రికార్డులకు ఎసరు పెట్టేలాగే కనిపిస్తున్నాడు.
మూడే మూడు రోజుల్లో ఇండియా వరకే రూ.100 కోట్లు కొల్లగొట్టిన సుల్తాన్ సినిమా.. వీకెండ్ అయ్యేసరికి రూ.170 కోట్లు ఖాతాలో వేసుకుంటుందని భావిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ‘సుల్తాన్’కు విదేశాల నుంచి భారీగా వసూళ్లు వస్తున్నాయి. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా విదేశీ వసూళ్లు రూ.56 కోట్ల దాకా ఉండటం విశేషం. ఇండియా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 8.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఒక్క యూఏఈ ప్రాంతంలోనే మూడు రోజుల్లో 3.5 మిలియన్ డాలర్లు వసూలు చేయడం సల్మాన్ స్టామినాను సూచిస్తుంది. ఇప్పటిదాకా షారుఖ్ ఖానే విదేశాల్లో బిగ్గెస్ట్ స్టార్ అనుకునేవాళ్లు. కానీ సల్మాన్ అతణ్ని మించిపోయాడని ‘సుల్తాన్’ రుజువు చేస్తోంది. డొమెస్టిగ్గా అమీర్ ను.. విదేశాల్లో షారుఖ్ ను ఒకేసారి దాటేసేలా ఉన్నాడు సల్మాన్. ఫస్ట్ వీకెండ్ తర్వాత ‘సుల్తాన్’ వసూళ్లలో మేజర్ డ్రాప్ లేకుంటే ఈ సినిమా ‘పీకే’ రికార్డును దాటేయడం ఖాయమే.