ఇండియాలో టాప్ గ్రాసింగ్ సినిమాలంటే దాదాపు అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉంటాయి. కాని ఈ శంకర్ అండ్ రాజమౌళి ఉన్నారు చూడండి.. టాప్ 5లో మేమూ ఉన్నాం అంటూ ఈ మధ్యనే కాస్త గాట్టిగా తొడకొట్టారు. ఇక బాహుబలి డిక్లేర్ చేసిన యుద్దం అయితే.. ఏకంగా తెలుగు సినిమా స్థాయిని ఇండియాకు పరిచయం చేసింది. అందుకే ఆ సినిమా రికార్డులను బీట్ చేయాలని పైకి చెప్పకపోయినా.. చాలామంది బాలీవుడ్ స్టార్లు అనుకుంటూనే ఉంటారు. అందులో సల్లూ భాయ్ హీరోగా వస్తున్న ''సుల్తాన్'' సినిమా కూడా ఒకటి. ఈ గురువారం నాడు రిలీజవుతోంది.
అసలే సల్మాన్ ఖాన్ సినిమా.. అది కూడా రంజాన్ సెలవను బేస్ చేసుకొని వస్తోంది.. పైగా ఈసారి నిర్మాత ఎవరంటే పబ్లిసిటీ కింగ్ అయిన యశ్ రాజ్ ఫిలింస్ వారు. అందుకే ఈ సినిమా రిలీజ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోంది అనే విషయంపైనే ఇప్పుడు ఎక్కువమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3000 వరకు స్ర్కీన్లను ఈ సినిమా కోసం రిజర్వు చేసి పెట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటికి మరిన్ని స్ర్కీన్లను ఈజీగా యాడ్ చేసే ఛాన్సుందట. ఆ లెక్కన చూస్తుంటే.. ఒకవేళ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేసి బంపర్ గా ఆడేస్తే.. ఖచ్చితంగా ఇండియాలో బాహుబలి కలక్షన్లను బ్రేక్ చేసే ఛాన్సుంటుంది మరి. సల్మాన్ తాపత్రాయం కూడా అదే అన్నట్లు అనిపిస్తోందిలే. ఇప్పటికే పాటలు కూడా మాంచి హిట్టవ్వడంతో.. సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్సుంది. యశ్ రాజ్ వారు వేసిన ప్లాన్లన్నీ అనుకున్నట్లే జరిగితే మాత్రం.. కలక్షన్లు బారీగానే ఉంటాయి.
దానికితోడు సల్మాన్ రేప్ కామెంట్లు.. అనుష్క ఎఫైర్ న్యూస్.. ఇవన్నీ సినిమాకు బాగానే పాపులార్టీ తెచ్చేస్తున్నాయి. హైప్ క్రియేట్ చేస్తున్నాయి. గతంలో బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలు కూడా బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తాయి అనుకున్నాం కాని.. జరగలేదు. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో.