రియల్ లైఫ్ స్టోరీలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కానీ.. బాలీవుడ్ లో ప్రస్తుతం వీటి ట్రెండ్ పీక్ స్టేజ్ లో ఉంది. వరుసగా అన్నీ పీరియాడికల్ మూవీస్.. బయోపిక్స్ వచ్చేస్తున్నాయి. ఈ ట్రెండ్ లో సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు. అయితే.. సల్లూభాయ్ పీరియాడికల్ కాన్సెప్ట్ కి మరిన్ని విశేషాలు కూడా జోడించి.. ట్యూబ్ లైట్ తీసేస్తున్నాడు. ఆగస్ట్ 15 సందర్భంగా ట్యూబ్ లైట్ కి ఫస్ట్ లుక్ విడదల చేసింది యూనిట్.
ఇలా ఆగస్ట్ 15నే ట్యూబ్ లైట్ ఫస్ట్ లుక్ ఇవ్వడానికి కారణం.. అది దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండడమే. 1962లో జరిగిన ఇండో-చైనీస్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో స్పెషల్ నీడ్స్ అవసరమైన ఓ వ్యక్తిగా సల్మాన్ కనిపించనుండగా.. ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలానే ఉంది. అందులో అటు తిరిగి నడుస్తున్న ఓ సైనికుడు కనిపిస్తాడు.
అక్కడ ఉన్నది సల్మాన్ అని గుర్తు పట్టేందుకు ఆడియన్స్ కి పెద్దగా టైమ్ అవసరం లేదు కానీ.. సల్మాన్ ఫేస్ ని చూపించకుండానే ఫస్ట్ లుక్ అనడంతోనే అందరికీ ఆశ్చర్యం వేసింది. ట్యూబ్ లైట్ లో సల్మాన్ లుక్ వెనక సీక్రెట్ ఉందని.. ఇప్పటికే గుసగుసలు మొదలైపోయాయి. ఈ మూవీలో చైనా భామ చూచూ హీరోయిన్ గా నటిస్తుండడం ఓ విశేషం కాగా.. సల్మాన్ సోదరడు సొహైల్ ఖాన్ ఈ మూవీలో రియల్ లైఫ్ మాదిరిగానే బ్రదర్ రోల్ చేస్తుండడం విశేషం.