ఆఫ్-స్క్రీన్ అందాలతో సెగలు రేపుతున్న సామ్ బేబీ!!

Update: 2020-12-28 12:36 GMT
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రోజురోజుకి తన డ్రెస్సింగ్ స్టైల్ తో సోషల్ మీడియాలో పెద్ద సునామి సృష్టిస్తోంది. రోజుకో వెరైటీ పోజులో, కొత్త కొత్త డ్రెస్సింగ్ స్టైల్స్ తో గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటుంది. తాజాగా సామ్ కొత్త పోజుతో చూసేవారు నివ్వెరపోయేలా చేసిందంటే నమ్మక తప్పదు. అలా ఉన్నాయి మరి రాను రాను అమ్మడి గ్లామరస్ ఫోటోషూట్స్. హీరో నాగచైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కాస్త ఆన్-స్క్రీన్ గ్లామర్ పాత్రలు చేయడం తగ్గించింది. కానీ ఆఫ్-స్క్రీన్ గ్లామర్ ప్రపంచంలో మాత్రం స్వేచ్ఛగా కుర్రకారుకు చెమటలు పట్టే రేంజిలో గ్లామర్ షో చేస్తోంది. సమంతను ఇలాంటి ఫోటోలలో చూస్తే ఎవరైనా నమ్మక మానరు. అంతలా ఆకట్టుకుంటున్నాయి వయ్యారి సోయగాలు. ఇక ఈ పోజు అయితే మరో లెవెల్ అని చెప్పాలి.

తాజా ఫోటోలో సామ్.. బ్లాక్ స్లీవ్ లెస్ వి-నెక్ ట్యాంక్ టాప్ తో  గ్రే-వైట్ టిన్సెల్ బాటమ్ ధరించి సోషల్ మీడియాను హీటేక్కిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ బేబీ! మేని మెరుపును రెట్టింపు చేస్తోంది గ్రే-వైట్ టిన్సెల్ బాటమ్. ఈ కొత్త డిజైన్ డ్రెస్ లో సామ్ మరింత అందంగా కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే సామ్, తన హబ్బీ చైతూతో కలిసి మాల్దీవ్స్ లో హాలిడేస్ ట్రిప్ కి వెళ్లొచ్చింది. అలా ట్రిప్ నుండి తిరిగి రాగానే క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఇంకా న్యూ ఇయర్‌ను స్వాగతించడానికి సమంత చైతూతో కలిసి పెద్ద ప్లానే వేస్తుందని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే సామ్.. విఘ్నేష్ శివన్, నయనతార సినిమాలో నటిస్తోంది. అలాగే ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో సామ్ జామ్‌ అనే టాక్ షో కూడా నిర్వహిస్తోంది. సామ్ జామ్ ప్రోగ్రాం కోసం 8-10 ఎపిసోడ్లకు సమంత కోటి వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.
Tags:    

Similar News