లేడీ సూపర్ స్టార్ నయనతార రెండు దశాబ్ధాల కెరీర్ ని అజేయంగా నడిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ స్టార్ గా వెలిగిపోతోంది. 2003లో మలయాళ చిత్ర సీమలో అడుగుపెట్టిన నయన్ 2006లో లక్ష్మి సినిమాతో తెలుగులో రంగ ప్రవేశం చేసింది. కెరీర్ జర్నీలో సూపర్ స్టార్ గా దూసుకెళ్లింది. సౌత్ లో గరిష్ఠంగా 6 కోట్ల పారితోషికం అందుకున్న ఏకైక తారగా నయన్ పేరు మార్మోగుతోంది. ఇప్పుడు కేవలం నయనతార కోసమే కథలు స్క్రిప్టులు రాసే దర్శకరచయితలు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. నయనతార కాల్షీట్ల కోసం నిర్మాతలు చాలా ముందే అడ్వాన్సులు ఇస్తుంటారు.
ఈ సుదీర్ఘ జర్నీలో చాలా సార్లు తన బర్త్ డే వేడుకలు సినిమాల సెట్లలోనే జరిగాయి. 18 నవంబర్ 2021న తన 37వ పుట్టినరోజును జరుపుకుంది నయన్. పురుషాధిక్య పరిశ్రమలో వ్యక్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొని దృఢ సంకల్పం ధైర్యంతో ఎదురీదిన కథానాయికగా తనకు ప్రత్యేక గౌరవం దక్కుతోంది. నిన్నటిరోజున బర్త్ డే వేడుకలకు తన సహనటులు సమంత.. విజయ్ సేతుపతి కూడా హాజరయ్యారు. నయనతార పుట్టినరోజు వేడుక చెన్నైలో జరిగింది.
ఈ బర్త్ డే వేడుకల ఫోటోలను సమంత ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి. నయనతారకు ఇంతకీ సామ్ ఎలాంటి కానుక ఇచ్చింది? అంటే.. ఎంతో ఆహ్లాదకరంగా సాగే అందమైన కవితను రాసి సామ్ శుభాకాంక్షలు తెలిపారు. ``ఆమె వచ్చింది..చూసింది..ఆమె ధైర్యం చేసింది.. ఆమె కలలు కన్నది.. ఆమె ప్రదర్శించింది ..ఆమె జయించింది !! హ్యాపీ బర్త్ డే నయన్`` అని దీనికి క్యాప్షన్ పెట్టారు. ఇక వేడుకల్లో నయన్ - సామ్ మధ్య ప్రేమాభిమానాలు ఎంతో ముచ్చటగొలిపాయి. ఒకరినొకరు ఎంతో ప్రేమగా హగ్ చేసుకుని బర్త్ డే వేడుకకే వన్నె తెచ్చారు. ఇక సమంతతో పోలిస్తే నయన్ 37 వయసులోనూ ఇంకా యంగ్ గా కనిపిస్తోందని అభిమానులు గుర్తించారు. నయన్ ఎల్లో కలర్ డిజైనర్ లుక్ లో కనిపిస్తే సామ్ కాంట్రాస్ట్ గా బ్లూ డెనిమ్ షర్ట్ ధరించి కనిపించారు.
`కాథువాకుల రెండు కాదల్`లో నయనతార - సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నిర్మించారు. కాతువాకుల రెండు కాదల్ డిసెంబర్ లో థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.