అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కి ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం నాన్ బాహుబలి రికార్డును దక్కించుకుంది. కొన్ని ఏరియాల్లో బాహుబలి మొదటి పార్ట్ వసూళ్లను కూడా బీట్ చేసింది అంటూ వార్తలు వచ్చాయి. కలెక్షన్స్ పరంగానే కాకుండా ఈ చిత్రం మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్ లో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. సినిమాలోని పాటలు గత ఏడు ఎనిమిది నెలలుగా శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను దక్కించుకుని సౌత్ ఇండియాలోనే టాప్ ఆల్బంగా నిలిచింది.
ఈ సినిమాకు చెందిన పాటల వీడియోలు యూట్యూబ్ లో ఏకంగా అయిదు వంద మిలియన్ లను క్రాస్ అయ్యాయి. సామజవరగమన వీడియో సాంగ్ 100 మిలియన్ లను అందుకుంది. అది మాత్రమే కాకుండా రాములో రాముల లిరికల్ మరియు వీడియో సాంగ్ కూడా వంద మిలియన్ ల వ్యూస్ రాబట్టింది. ఇక బుట్ట బొమ్మ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అది ఎప్పుడో వంద మిలియన్ ల వ్యూస్ ను క్రాస్ చేసింది. థమన్ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ ఆల్బం ఈ ఏడాదిలోనే కాకుండా ఈ దశాబ్దంలోనే టాప్ ఆల్బంగా యూట్యూబ్ లో నిలవడం ఖాయం అంటూ బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. యూట్యూబ్ రికార్డుల మోత కొనసాగుతూనే ఉంటుందని అది ఎంత దూరం వెళ్తుందో ఎవరు ఊహించలేరంటూ బన్నీ అభిమానులు ఇంకా ఆల్బం గురించి ధీమాను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.