3 తమిళం ..3 తెలుగు ..4 నెలలు

Update: 2017-05-24 09:38 GMT
సమంత తన ప్రేమికుడు నాగచైతన్యతో ఈ ఏడాది అక్టోబర్ లో పెళ్లి పీటలెక్కనుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఆమె సెప్టెంబర్ చివరి వారం నుంచి షూటింగ్ లకు విరామం ప్రకటించే అవకాశం ఉంది. ముందు ఇచ్చిన కాల్షీట్స్ ఎలాగున్నా మిగిలిన ఈ నాలుగు నెలల్లోనే సమంత సినిమాలన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తెలుగులో మూడు, తమిళంలో మూడు చొప్పున మొత్తం రెండు భాషల్లో కలిపి ఆమె ఆరు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే ఒకో సినిమాకు సగటున 20 రోజులకు మించి వర్క్ చేయడం కష్టమేనని చెప్పాలి.

 ప్రస్తుతం సమంత తెలుగులో రాజుగారి గది-2, మహానటి, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చింది. కాబోయే మామ నాగార్జున లీడ్ రోల్ లో నటిస్తున్న రాజుగారి గది-2 సినిమాలో సమంత నటించాల్సిన పార్ట్ షూటింగ్ ఇప్పటకే పూర్తయిపోయింది. ఇక మహానటిలో ఆమెది టైటిల్ రోల్ కాదు. సావిత్రి జీవిత కథతో తీస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ కీర్తి సురేష్ చేస్తోంది. కాబట్టి ఈ సినిమా షూటింగ్ కూడా గబగబా అయిపోతుంది. ఎటొచ్చీ తెలుగులో సుకుమార్ సినిమాకే సమంత ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది. ఎందుకంటే సుకుమార్ సినిమాలంటేనే కాస్త టైం తీసుకుంటాయి. అదీగాక షూటింగ్ కొంత పూర్తయ్యాక రావ్ రమేష్ ను పక్కన పెట్టి ప్రకాష్ రాజ్ ను తెరపైకి తెచ్చారు. ఆ సీన్లన్సీ మళ్లీ రీ షూట్ చెయ్యాలి.

దీంతోపాటు తమిళంలో విజయ్ హీరోగా నటించే 61, ఇరుంబు తిరాయ్, అనేతి కథైగల్ సినిమాల్లో సమంత ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ సినిమాలన్నీ ఆల్రెడీ చకచకా షూటింగ్ అయిపోతున్నాయ్. సమంత పెళ్లి దృష్టిలో పెట్టుకుని అందరూ షెడ్యూల్స్ స్పీడప్ చేస్తున్నారు. సుకుమార్ కూడా దీనిని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ కల్లా షూటింగ్ కొలిక్కి తేవాలి. లేదంటే డిలే చేసేవారంతా సమంత - నాగచైతన్య పెళ్లి సందడి పూర్తయి నవంబర్ లేదా డిసెంబర్ దాకా ఎదురుచూడాలి.
Tags:    

Similar News